Samantha Raj Nidimoru Photo: ‘ఏమైంది ఈ వేళ ‘ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైన సమంత ఆ మూవీతో మంచి విజయాన్ని సాధించి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా అవతరించింది. ఇక నాగచైతన్యతో ప్రేమ వ్యవహారం నడిపి అతన్ని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే… మొత్తానికి అయితే వీళ్ళ బంధం ఎక్కువ కాలం పాటు నిలువలేదు. వీళ్ళిద్దరి మధ్య వచ్చిన కొన్ని వివాదాలు వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకొని తన లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. సమంత మాత్రం ఇప్పటి వరకు సింగల్ గానే ఉంటుంది. ఇక ‘ది ఫ్యామిలీ మెన్’ సిరీస్ లో నటించిన సమంత ఆ సిరీస్ డైరెక్టర్ అయిన రాజు నిడిమోరు తో పరిచయం పెంచుకుంది. అప్పటినుంచి వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అంటూ ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు.
Also Read: బలగం వేణు ఏడ్చేశాడు.. నేను ఒకటే మాట చెప్పాను.. తేజ బయటపెట్టిన
కానీ వాళ్ళు దిగిన ఫోటోలు గాని, వాళ్ళు కనిపిస్తున్న తీరుగాని చూస్తుంటే వీళ్ళిద్దరూ మంచి రిలేషన్ షిప్ లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజ్ కి ఇంతకుముందే పెళ్లయినప్పటికి ఆయన సమంతతో తిరగడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు. ఇక రీసెంట్ గా సమంత తన కొత్త పర్ఫ్యూమ్ బ్రాండ్ ని లాంచ్ చేసింది.
అందులో హాట్ హాట్ గా కనిపించిన సమంత తనకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇక అన్ని ఫోటోలు ఒకెత్తయితే రాజ్ తో క్లోజ్ గా దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోను బట్టి చూస్తే ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇలా ఫోటోలు దిగరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాజ్ సమంత నడుము మీద చెయ్యి వేసి చాలా క్లోజ్ గా మూవ్ అయినట్టుగా ఫోటో దిగాడు. వీళ్లిద్దరూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందనే చెప్పాలి.
ప్రస్తుతం వీళ్లు ప్రపంచాన్ని మర్చిపోయి చాలా హ్యాపీగా తమ లైఫ్ ను లీడ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది.. ఫ్యామిలీ మెన్ సిరీస్ తో స్టార్ట్ అయిన వీళ్ళ పరిచయం సిటాడెల్, హనీ బన్నీ లాంటి ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు వీళ్ళు పార్టీలు, పబ్బు లు అంటూ కలిసి తిరగడంతో వార్తల్లో నిలిచారు…ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరూ రక్త బ్రహ్మాండ్, మా ఇంటి బంగారం అనే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. మరి వీళ్ళ పోకడ చూస్తుంటే తొందర్లోనే అఫీషియల్ గా ఏదో అనౌన్స్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది…