Jagan: జగన్( Y S Jagan Mohan Reddy ) సీబీఐ కోర్టుకు హాజరవుతారా? లేదా? ఎందుకు హాజరు కావడానికి ఇష్టపడడం లేదు? హాజరైతే మునుపటి మాదిరిగా వారం వారం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందా? ఇప్పుడు అందరిలో మెదులుతున్న అంశం ఇదే. కొద్ది రోజుల కిందట విదేశీ పర్యటన ముగించుకొని జగన్మోహన్ రెడ్డి ఏపీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయనపై అవినీతి కేసులు ఉన్న తరుణంలో విదేశాలకు వెళ్లేటప్పుడు కోర్టు అనుమతి తప్పనిసరి. అయితే కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తిరిగి వచ్చిన వెంటనే.. కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు తాను హాజరు కాలేనంటూ అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు అన్నది ఇప్పుడు చర్చ. కోర్టుకు హాజరుకాబడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. లేకుంటే కోర్టు ఏదైనా కఠిన ఆదేశాలు ఇస్తుందన్న అనుమానం ఉందా? ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది.
Also Read: బలగం వేణు ఏడ్చేశాడు.. నేను ఒకటే మాట చెప్పాను.. తేజ బయటపెట్టిన నిజం…
* 2019 వరకు కోర్టులో హాజరు..
అక్రమాస్తుల కేసుల్లో 2012లో అరెస్టయ్యారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 16 నెలల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది న్యాయస్థానం. అది మొదలు 2019 ఎన్నికల వరకు ఆయన హాజరవుతూనే ఉన్నారు. గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం విరామం ఇచ్చేవారు. హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయన గెలవడం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పాలనాపరమైన అంశాల్లో బిజీగా ఉన్నందున.. కోర్టుకు హాజరు విషయంలో తనకు మినహాయింపు కావాలని కోరారు జగన్మోహన్ రెడ్డి. దీంతో కోర్టు మినహాయింపు ఇచ్చింది.
* విదేశీ పర్యటనకు అనుమతి..
ఇటీవల జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు( London tour) వెళ్లారు. సిపిఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలని కోరారు. కోర్టు అంగీకారం తెలపడంతో పాటు తిరిగి వచ్చిన వెంటనే కేసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈనెల 14న జగన్ కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇంతలోనే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి. తాను హాజరైతే భద్రతాపరమైన అంశాలతో పాటు ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని.. ప్రభుత్వంపై భారం పడుతుందని.. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనను విచారించాలని ఆయన ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. గత 13 సంవత్సరాలుగా జగన్ పై మోపిన అక్రమాస్తుల కేసు విచారణ ముందుకు సాగడం లేదు. కనీసం కోర్టులో ట్రైల్ కూడా రాలేదు. దీనిపై cbi గట్టిగానే ఉంది. ఇప్పుడు కూడా కోర్టుకు జగన్మోహన్ రెడ్డి తప్పక హాజరు కావాల్సిందేనని పట్టుబడుతోంది. కానీ జగన్ మాత్రం ససేమిరా అంటున్నారు. మరి చూడాలి ఇవి వ్యవహారం ఎలా ముగింపు నకు వస్తుందో?