Samantha pregnant: సోషల్ మీడియా లో ప్రస్తుతం సమంత ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మయోసిటిస్ వ్యాధి కారణంగా కొంతకాలం నుండి సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చిన సమంత , ఇప్పుడు ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా నిన్న మన ముందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ తో పాటు, బంపర్ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. మొదటి రోజే 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి వచ్చాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రొమోషన్స్ మొదలైనప్పటి నుండి సమంత గురించి సోషల్ మీడియా లో ఓకే వార్త బాగా ప్రచారం అవుతోంది. అది ఏమిటంటే ఆమె తల్లి కాబోతుంది అని.
ఎందుకంటే సమంత ఈ సినిమా కోసం దాదాపుగా 50 కి పైగా ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అదే విధంగా ఎన్నో ఈవెంట్స్ ని కూడా నిర్వహించింది. వీటి అన్నిట్లోనూ ఆమె చీర ధరించడమే ఇప్పుడు ఈ ప్రెగ్నన్సీ అనుమానాలు అభిమానుల్లో కలిగేలా చేశాయి. బేబీ బంప్ ని దాచడం కోసమే, ఆమె ఇలా చీర లోనే ఎక్కువగా కనిపించిందని , సాధారణంగా సమంత మోడరన్ దుస్తుల్లో కనిపించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని , ఇలా రకరకాల కథనాలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి. దీని పై సమంత లేదా , ఆమె భర్త రాజ్ నిడిమోరు స్వయంగా స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. గత ఏడాది ఈమె రాజ్ నిడిమోరు ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ సమయం నుండి వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
అప్పటి నుండి వీళ్లిద్దరు మంచి స్నేహితులు గానే కొనసాగుతూ వస్తున్నారు. ఇక కొన్ని కారణాల వల్ల, ఆమె నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత మయోసిటిస్ వ్యాధితో తీవ్రమైన ఇబ్బందికి గురి కావాల్సి వచ్చింది. ఈ సమయం లో ఆమెకు రాజ్ నిడిమోరు ఇచ్చిన ధైర్యం సాధారణమైనది కాదు. ఆ కఠినమైన సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ప్రేమగా మారేలా చేసింది. అప్పటి నుండి డేటింగ్ చేసుకుంటూ వచ్చిన వీళ్లిద్దరు గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన కుటంబత్తూరు లోని ఈషా యోగా కేంద్రం లో పెళ్లి చేసుకున్నారు. ఇక రీసెంట్ గా విడుదలైన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి రాజ్ నిడిమోరు కథ ని కూడా అందించాడు.
