Samantha New Movie Update: స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసి మంచి పాపులారిటిని సంపాదించుకున్న నటి సమంత…ఆమె గతంలో అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది… ఇక వాళ్లిద్దరి మధ్య వివాదాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే… ఇక ప్రస్తుతం నాగ చైతన్య తన లైఫ్ ను సాఫీగా కొనసాగిస్తుంటే సమంత మాత్రం రీసెంట్ గా రాజ్ నిడిమోరు అనే దర్శకుడిని పెళ్లి చేసుకుంది.ఇక ప్రస్తుతం తన సినిమాలను చేస్తున్నప్పటికి కొన్ని బ్రాండ్స్ కి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా సైతం వ్యవహరిస్తుంది. మైల్ కలెక్టివ్ అనే ఒక బ్రాండ్ కి తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది…ఈ బ్రాండ్ దుస్తువులు చాలా తేలికగా, మేఘంలా అనిపిస్తాయి… ఈ దుస్తువులు మీకు ఎలా కదలడానికి హెల్ప్ అవుతాయి. ఇవి కేవలం ఫిట్నెస్ దుస్తులు మాత్రమే కాదు. రెగ్యూలర్ గా వీటిని వాడుకోవచ్చు అంటూ ఆమె ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతంలో ఆమె చాలా బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె పెద్దగా బ్రాండ్స్ ని ప్రమోట్ అయితే చేయడం లేదు. గతం లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన దగ్గరికి ఒక 15 బ్రాండ్స్ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని అడిగినప్పటికి తను వాటిని సున్నితంగా రిజెక్ట్ చేశానని చెప్పింది.
కారణం ఏంటి అంటే తను ఏదైనా బ్రాండ్ ని ప్రమోట్ చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురు డాక్టర్లను సంప్రదించి దానివల్ల జనాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. అని అనుకున్నప్పుడు మాత్రమే నేను ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తానని ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉంది అంటే మాత్రం తన బ్రాండ్ ను పక్కన పెట్టేస్తానని ఆమె చెప్పింది. జనాల ఆరోగ్యం కూడా మనకు ముఖ్యమే కదా అంటూ తను కొన్ని మాటలైతే చెప్పింది…
ఇక మొత్తానికైతే సమంత ప్రస్తుతం కొన్ని సినిమాల్లో బిజీ అయిపోయింది. ఇక ప్రస్తుతం తను రాజ్ నిడిమోరు ను పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసింది. కాబట్టి ఈసారైనా ఆమెకి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రెండు సంవత్సరాల జీవితాన్ని సాఫీగా సాగించాలని తన అభిమానులకు సైతం కోరుకుంటున్నారు…