
Samantha Naga chaiytanya:హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు మూడేళ్లుగా చిలకా గోరింకలుగా ఉంటున్నారు. అయితే ఇటీవల సమంత తన ఇంటి పేరు ‘అక్కినేని’ తీసేసి ‘సమంతరుతుప్రభు’ అని తన తండ్రిపేరు పెట్టుకోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని విడిపోయారని వార్తలు వచ్చాయి. విడాకులు తీసుకోబోతున్నారని గాసిప్ లు వచ్చాయి. సమంతను డైరెక్టుగా అడిగినా సమయం వచ్చినప్పుడు చెబుతాననడంతో ఇవి మరింత ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలో సమంత-నాగచైతన్య వేరువేరుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. సమంత ప్రస్తుతం గోవా టూర్ ముగించి చెన్నైలో ఉంటున్నారని వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లో ఉండడం లేదని అంటున్నారు. ఇక నాగచైతన్య ఒంటరిగానే ఉంటున్నారని టాక్ వినిపించింది.
అయితే ఈ గాసిప్ లపై ఇంతవరకూ చైతన్య కానీ.. సమంత కానీ స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ సాగుతోంది. ఈక్రమంలోనే నాగచైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ సాక్షిగా సమంత-నాగచైతన్య బంధంపై క్లారిటీ వచ్చేసింది.
ఇవాళ విడుదలైన ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ మంచి టాక్ తెచ్చుకోవడంతో చైతన్య చేసిన ట్వీట్ ను సమంత రీట్వీట్ చేసింది. నాగచైతన్యకు ‘ఆల్ ది బెస్ట్ చెబుతూ’ సమంత ట్వీట్ చేసింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమంత-చైతన్య విడిపోలేదని అర్థమవుతోంది. అయితే అందులో సాయిపల్లవి పేరును ప్రస్తావించిన సమంత.. తన భర్త అయిన చైతన్య పేరును పలకకపోవడంతో అనుమానం కలుగుతోంది. చూడాలి మరి మున్ముందు వీరి బంధం ఎటువైపు దారితీస్తోందో..
https://twitter.com/Samanthaprabhu2/status/1437360234285056001?s=20