Samantha : సమంత, నాగ చైతన్య గురించి సోషల్ మీడియా లో ప్రతీరోజు ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. వీళ్లకు సంబంధించిన వార్త ఎలాంటిదైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. అంటే జనాలు వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి అంతలా అమితాసక్తిని చూపిస్తున్నారు అన్నమాట. ఒకప్పుడు సమంత, నాగచైతన్య కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. సమంత అయితే నాగ చైతన్య కి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొని మురిసిపోయేది. ఆమె మాట్లాడే మాటలను చూస్తే నాగ చైతన్య అంటే ఆమెకి ఎంత ఇష్టమో తెలిసేది. సమంత అభిమానులు అప్పుడప్పుడు సోషల్ మీడియా లో ఆ పాత జ్ఞాపకాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా 2019 వ సంవత్సరంలో సమంత ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ అనే కార్యక్రమంలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి వైరల్ గా మారాయి.
ఆమె మాట్లాడుతూ ‘నేను నాగ చైతన్య కి మొదటి భార్య ని కాదు. అవును మీరు వింటున్నది నిజమే. నాగ చైతన్యకి మొదటి భార్య ఎవరంటే ఆయనకి ఎంతో ఇష్టమైన దిండునే. కూర్చున్నా, పడుకున్నా ఆయన ఆ దిండుని తన వద్దనే ఉంచుకుంటాడు. బెడ్ రూమ్ లో మేమిద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య ఆ దిండు ఉండేది. నేను ముద్దు ఇచ్చేటప్పుడు కూడా ఆ దిండు మా మధ్య ఉండాల్సిందే. అందుకే నేను నీ మొదటి భార్య అదేనంటూ చైతు ని తీజ్ చేస్తుంటాను’ అని చెప్పుకొచ్చింది సమంత. ఇప్పుడు శోభిత కి కూడా అదే పరిస్థితి అన్నమాట అంటూ నాగ చైతన్య అభిమానులు ఈ వీడియో ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో సమంత చేసిన ఈ కామెంట్స్ నేషనల్ లెవెల్ లో వైరల్ అయ్యాయి.
ఇది ఇలా ఉండగా నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే పాటల ద్వారా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ చిత్రం, ట్రైలర్ తో మరింత క్రేజ్ ని సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. నాగ చైతన్య గత చిత్రాలకు వచ్చిన క్లోజింగ్ వసూళ్లు, కేవలం మొదటి రోజే రాబట్టే రేంజ్ లో ట్రెండ్ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం కూడా ఉందట. ప్రస్తుతం బుకింగ్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి,చూడాలి మరి ఆ రేంజ్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందా లేదా అనేది.