spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha Maa Inti Bangaram movie postponed: సమంత 'మా ఇంటి బంగారం' మూవీ వాయిదా.....

Samantha Maa Inti Bangaram movie postponed: సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ వాయిదా.. కారణం ఏంటంటే..

Samantha Maa Inti Bangaram movie postponed: సుదీర్ఘ విరామం తర్వాత సమంత(Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం'(Maa Inti Bangaram) చిత్రం మే 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఇప్పటికే మేకర్స్ అధికారిక ప్రకటన చేసి , ప్రొమోషన్స్ కూడా మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదలైన ‘తస్సాదియ్యా’ అనే పాటకు కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో అప్పుడే ఈ పాటపై వేల సంఖ్యలో రీల్స్ కూడా అప్లోడ్ అయ్యాయి. సినిమా పై మంచి పాజిటివ్ బజ్ ఉండడం వల్ల , ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని మే 15 నుండి వాయిదా వేస్తున్నట్టు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అందుకు కారణం IPL సీజన్ అని తెలుస్తోంది.

ఈ IPL ప్రభావం పెద్ద సూపర్ హిట్ సినిమాలపై కూడా చాలా బలంగా పడింది. అలాంటిది కీలకమైన ప్లే ఆఫ్స్ సమయంలో సినిమాలను థియేటర్స్ కి వెళ్లి చూసే మూడ్ లో ఆడియన్స్ ఉండరు. అందుకే ఈ చిత్రాన్ని జూన్ 4 న వాయిదా వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే అదే జూన్ 4న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాపై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ సినిమాకు పోటీగా వస్తే, నష్టపోయేది సమంత నే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ‘పెద్ది’ విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి, పెద్ది టీం వేసే అడుగులను బట్టే ‘మా ఇంటి బంగారం’ ని విడుదల చెయ్యాలని చూస్తున్నారట. ఈ చిత్రానికి సమంత నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

మరోపక్క సమంత కి రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఎన్నో సందర్భాల్లో రామ్ చరణ్ పై తనకు ఉన్న అభిమానాన్ని చూపించింది సమంత. కాబట్టి , ఒక్కసారి ‘పెద్ది’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తే ఆమె వేరే డేట్ లో తన సినిమాని విడుదల చేసుకోవడానికి చూస్తుంది కానీ , రామ్ చరణ్ కి పోటీగా రాదని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది . ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అదే రేంజ్ ఫలితాన్ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper