https://oktelugu.com/

Samantha: చైతన్యతో ఉన్న ఇంటినే మళ్లీ కొని ఉంటున్న సమంత.. అసలేమైంది? కారణమేంటి?

Samantha: అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ ఎంతగా సంతోషించారో.. విడిపోయాక అంతే బాధపడ్డారు. అసలు వారు విడిపోవడానికి గల కారణాలు బయటపడలేదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు చైతు, సమంత విడాకులకు అనేక కారణాలు ఉన్నాయనే విషయం తర్వాత బయటపడింది. ఇగోల వల్లే విడిపోయినట్టు ప్రచారం సాగింది. నాగచైతన్యతో విడాకులపై తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత విభేదాలు తారాస్థాయికి చేరడం వల్లే విడిపోయినట్టు బయటపెట్టింది. […]

Written By: , Updated On : July 29, 2022 / 11:29 AM IST
Follow us on

Samantha: అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ ఎంతగా సంతోషించారో.. విడిపోయాక అంతే బాధపడ్డారు. అసలు వారు విడిపోవడానికి గల కారణాలు బయటపడలేదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు చైతు, సమంత విడాకులకు అనేక కారణాలు ఉన్నాయనే విషయం తర్వాత బయటపడింది. ఇగోల వల్లే విడిపోయినట్టు ప్రచారం సాగింది. నాగచైతన్యతో విడాకులపై తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత విభేదాలు తారాస్థాయికి చేరడం వల్లే విడిపోయినట్టు బయటపెట్టింది.

Samantha

Samantha

విడిపోయాక ఎవరి కెరీర్ పై వారు దృష్టి సారించారు. సినిమాల నిర్మాణంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఒకరికంటే మరొకరు పోటీపడి సినిమాలు చేస్తున్నారు. ఒకరికంటే మరొకరు ఎక్కువగా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరు కుటుంబాల వారు వారిని కలపాలని ప్రయత్నించినా వారు మాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో చైతు తండ్రి నాగార్జున సైతం ఇన్ వాల్వ్ అయి వారిని ఒప్పించాలని ప్రయత్నించినా కుదరలేదట. దీంతో వారిని ఆ దేవుడే కలపాలని ఆశిస్తున్నారు.

Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న ఇమేజ్.. కారణమేంటి?

పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోవడంపై అందరికీ ఆశ్చర్యం వేసింది. వీరి విడాకులకు కారణాలేంటని పలువురు ప్రశ్నించినా సరైన సమాధానాలు మాత్రం రాలేదని తెలుస్తోంది. మొత్తానికి వీరి విడాకుల తరువాత జరిగే పరిణామాలతో వీరు మళ్లీ కలుస్తారనే విశ్వాసం అందరిలో సన్నగిల్లుతోంది. చివరకు ఏం జరుగుతుందో తెలియడం లేదు.

Samantha

Chay, Sam

అయితే సమంత-నాగచైతన్య విడిపోయాక వారు గతంలో కలిసి ఉన్న అపురూపమైన ఇంటిని సమంత మళ్లీ కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సమంత గతంలో చైతుతో ఉన్న ఇంటిని భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసిందట.. ఈ విషయాన్ని ఆ అపార్ట్మెంట్ ఓనర్ అయిన నటుడు మురళీమోహన్ బయటపెట్టారు. దీంతో సమంత మనసు మార్చుకుందని.. వారిద్దరు మళ్లీ కలిసే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. చైతూతో ఉన్న పాత ఇల్లునే భారీగా డబ్బులు పెట్టి కొనుగోలు చేయడం వెనుక అసలు కారణమేంటనే కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు.

వీరి పెళ్లికి ముందు ఓ పెంట్ హౌస్ ను నాగచైతన్య కొనుగోలు చేశాడు. పెళ్లయిన తరువాత వీరు అందులోనే ఉన్నారు. కానీ వారికి ఓ కొత్త ఇల్లు కావాలని మరో ఇల్లు చూసుకున్నారు. దీన్ని అమ్మేశారు. కానీ మళ్లీ అదే ఇంటిని సమంత తిరిగి కొనుగోలు చేసింది. ఎందుకంటే ఇక్కడ తనకు సెక్యూరిటీ ఉంటుందని చెబుతోంది. నగరం నడిబొడ్డున, విశాలమైన, ప్రశాంతమైన ప్రాంతం కావడం వల్లే చైతన్యతో గతంలో జీవించిన ఇంటిని సమంత తిరిగి కొన్నదని టాక్. తన తల్లితో కలిసి సమంత అక్కడే ఉంటోందట.. చైతుతో తిరిగిన ఆ ఇల్లునే మళ్లీ ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం వెనుక ఆమె చైతును మరిచిపోలేకపోతోందనే వాదనలు కూడా వస్తున్నాయి. సో వీరు మళ్లీ కలిస్తే అందరికి పండగే అని చెబుతున్నారు. కలుస్తారో లేదో ఆ దేవుడికే తెలియాలి.

Also Read: Modi- Mamata: మోడీ దెబ్బకు మమత జాతీయ కలలు కల్లలు

Tags