https://oktelugu.com/

Samantha: ఆ పాత్రను అందుకే చేశానని మనసులో మాట చెప్పిన సమంత…

Samantha: సమంత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య సరసన ” ఏ మాయ చేశావే ” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. 2017 లో చైతన్యను వివాహం చేసుకుని… ఇటీవల వారి వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ తాము విడిపోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా విడాకుల త‌ర్వాత కూడా ఫుల్ బిజీగా ఉంటుంది స‌మంత. గోవాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 22, 2021 / 06:30 PM IST
    Follow us on

    Samantha: సమంత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య సరసన ” ఏ మాయ చేశావే ” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. 2017 లో చైతన్యను వివాహం చేసుకుని… ఇటీవల వారి వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ తాము విడిపోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా విడాకుల త‌ర్వాత కూడా ఫుల్ బిజీగా ఉంటుంది స‌మంత.

    గోవాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 52వ ‘భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ)లో స్పెషల్ గెస్ట్ గా సమంత పాల్గొన్నారు. ఈ చిత్రోత్సవం లో భాగంగా ఫ్యామిలీ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డీకే, నటి సమంత లతో పాటు అమెజాన్‌ ఇండియా హెడ్‌ అయిన అపర్ణా పురోహిత్‌ లను ‘మాస్టర్‌ క్లాస్‌’ వారు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సంధర్భంగా సమంత పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ మేరకు ‘ఫ్యామిలీ మ్యాన్‌ – 2’ వెబ్‌ సిరీస్‌లోని క్లిష్టమైన యాక్షన్‌ పాత్ర రాజీని తాను ఎంచుకోవడానికి గల కారణాన్ని వివరించింది. కొత్తదనం కోసం తపిస్తున్న తాను… ఆ పాత్రను గురించి వివరించగనే వెంటనే ఒకే చెప్పానని సామ్ చెప్పింది.

    అలానే తెలుగు పరిశ్రమ, హైదరాబాద్‌ తనకు పుట్టినిల్లు అని… నటిగా తనకు ఈ స్థానాన్ని ఇచ్చింది అవే అంటూ సమంత వివరించింది. అదే విధంగా తాను ఇంకా హిందీ సినిమా లేవీ చేయలేదు కానీ… ఉత్తరాది పరిశ్రమకు, దక్షిణాది పరిశ్రమకు పెద్ద తేడా ఏమీ లేదు అన్నారు. ఫ్యామిలీ మ్యాన్‌ 2 లోని పాత్రతో ఇక హిందీ ‘ధూమ్‌’ సిరీస్‌ లాంటి వాటిలో అవకాశాలు రావచ్చని ప్రేక్షకుల ప్రశంసిస్తున్నారంటూ వ్యాఖ్యాత చెప్పింది. ఈ మాటలకు సమంత హ్యాప్పిగా ఫీల్ అవుతూ… నేనిక యాక్షన్‌ స్టార్‌ అన్న మాట అని నవ్వేసింది.