Karthika Dipotsavam in Canada: శ్రీఅనఘా దత్త సొసైటీ ఆధ్వర్యంలో కెనడా కాల్గరీ సాయిబాబా మందిరంలో కార్తీక దీప వేడుకలు ఘనంగా జరిగాయి . భగవన్నామ స్మరణ కీర్తనలతో, ధూప, దీప నైవేద్యాలతో వేడుకలు కన్నుల పండుగగా జరిపారు. ఇవీ చూపరులను ఆకట్టుకున్నాయి. వెయ్యికి పైగా దీపాలు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలతో ప్రారంభమయ్యి, భగవన్నామస్మరణలు, పూజలు, హారతులతో దైవ ప్రాంగణం అలంకారాలతో కన్నుల విందుగా సాగింది. మధ్యాన్నహారతి, రుద్ర హోమం, కార్తీక పూర్ణిమ సత్యనారాయణ వ్రతం ఘనంగా నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు పండిట్ రాజకుమార్ శర్మ విశేషానుభవంతో దేవ, దేవి అలంకారాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పండిట్ రాజకుమార్ శర్మ కార్తీక దీప విశేషాన్ని భక్తులకు వివరించారు.
కోవిడ్ నిబంధనలు అతిక్రమించకుండా భక్తులు తమ వంతు పూజలకు వేచి ఉండి.. నియమ నిబద్దత పాటించిన తీరు ఎంతో శ్లాఘనీయమైంది. మందిరంలో శివ, పార్వతి, సాయిబాబా మూర్తులకు అభిషేకం నిర్వహించారు. నాలుగు వందలకు పైగా భక్తులు పాల్గొన్నారు.
ఆలయ నిర్వాహకులు శ్రీమతి లలిత, శైలేష్ మరియు చాల మంది వాలంటీర్లతో ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్దగా, నిర్విఘ్నంగా గా నెరవేర్చారు. ఆలయ నిర్వహణ తోడ్పాటుకు ఎంతో మంది విరాళాలు సమర్పించారు.
Also Read: దీపాలను వెలిగించడంలో ఏ నియమాలు ఉన్నాయో తెలుసా.. పూర్తి వివరాలతో?
శ్రీమతి లలిత గారు మాట్లాడుతూ ఏ దేశ మేగినా ఎందు కాలిడినా మన హైందవ సాంప్రదాయ పటుత్వాన్ని నెలకొల్పాలని హిందూ రక్షణ లో భాగం కావాలని కోరుతున్నారు.
శ్రీఅనఘా దత్త సొసైటీ అఫ్ కాల్గరీ ఒక హిందూ రక్షణ సమితి. హైందవ సాంస్కృతిక సంగీతము, భరతనాట్యము, క్లాసికల్ ఆర్ట్స్ మరిన్ని శాఖల పరిరక్షణ కి ఆయువు పట్టుగా నిలిచింది. వీరి ఆధ్వర్యంలో కెనడా దేశంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
Also Read: దివాళీ రోజున బాణసంచా.. తెలుగు రాష్ట్రాల్లో అనుమతి ఉందా??