Samantha in Ravi Teja movie: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) ఇక పై సినిమాల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని బలంగా ఫిక్స్ అయిపోయాడు. ధమాకా తర్వాత రవితేజ చేస్తున్న ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను సొంతం చేసుకుంటున్నాయి. కొత్త తరం ఆడియన్స్ అభిరుచి కి తగ్గట్టు రావణాసుర, ఈగల్, టైగర్ నాగేశ్వర రావు వంటి సినిమాలు తీస్తే ఫ్లాప్ చేశారు, ఇది వర్క్ అవుట్ అవ్వడం లేదని మిస్టర్ బచ్చన్, మాస్ జాతర వంటి మాస్ కమర్షియల్ సినిమాలు తీసినా ఫ్లాప్ చేస్తున్నారు, అసలు ఎలాంటి సినిమాలు తియ్యాలి? అని బాగా ఆలోచించిన రవితేజ, మిత్రుల సలహాలు, అభిమానుల సలహాలు తీసుకొని, ఇక మీదట అనుభవం లేని కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యకూడదు అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాడట. పైన చెప్పిన సినిమాలన్నీ అంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి కారణం కొత్త డైరెక్టర్స్.
ప్రస్తుతం ఆయన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకుడు. గతంలో ఈయన నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలు తీసాడు. మినిమం గ్యారంటీ డైరెక్టర్, పైగా కొత్త తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించినట్టు రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ని చూస్తేనే అర్థం అవుతుంది. ఈ చిత్రం తర్వాత మ్యాడ్ సిరీస్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా, ఆ తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక మల్టీ స్టార్రర్, ఇలా అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటున్నాడు రవితేజ. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్, ఖుషి వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ త్వరలోనే రవితేజ తో ఒక సినిమా చేయబోతున్నాడు అట.
ఇందులో హీరోయిన్ ఎవరో కాదు, మన సమంత(Samantha Ruth Prabhu). చాలా కాలం తర్వాత ఆమె ఒప్పుకుంటున్న తెలుగు సినిమా ఇది. ఇప్పటి వరకు రవితేజ, సమంత కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. సమంత ఒక సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుందంటే, కచ్చితంగా ఆ సినిమాలో మంచి విషయమే ఉంటుందని దాని అర్థం. అంతే కాకుండా, తన క్యారక్టర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటూనే ఆమె ఒక సినిమాకు ఒప్పుకుంటుంది. కాబట్టి ఈ సినిమా కూడా మినిమం గ్యారంటీ కంటెంట్ ఉన్న సినిమా అని అనుకోవచ్చు. ఈ నెలలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.