Samantha Missing: ఐదు వారాలుగా సమంత కనిపించడం లేదు. ఆమె ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడున్నావు సామ్ రిప్లై ఇవ్వు అంటున్నారు. ఓ ఏడాది కాలంగా సమంత వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ప్రేమించినవాడు నాగ చైతన్యను కోరి పెళ్లి చేసుకుంటే కథ మధ్యలోనే ముగిసింది. నాలుగేళ్ళ వివాహ బంధం తర్వాత గత ఏడాది విడిపోయారు. అప్పటి నుండి సమంత మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఆమెలో ఒకప్పటి సంతోషం లేదు. అలాగే కొందరిపై ఆమె తీవ్ర ఆవేశం కలిగివున్నారు
సమంత సోషల్ మీడియా పోస్ట్స్, ఆమె బిహేవియర్ ద్వారా ఈ విషయం చెప్పవచ్చు. విడాకుల డిప్రెషన్ నుండి బయటపడడానికి సమంత పలు టూర్స్ కి వెళ్లారు. తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి ఆధ్యాత్మిక, రిఫ్రెష్మెంట్ టూర్స్ కి వెళ్లడం జరిగింది. విడిపోవడానికి ముందు సమంత, చైతు మధ్య పెద్ద సంఘర్షణే జరిగిందనడానికి ఇదే నిదర్శనం. కాగా ఆమె ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సోషల్ మీడియాను వదిలేవారు కాదు. బాధైనా సంతోషమైనా ఫ్యాన్స్ తో పంచుకునేవారు.

అలాంటి సమంత సోషల్ మీడియాకు పూర్తిగా దూరమయ్యారు. ఆమె ఐదు వారాల నుండి ఒక్క పోస్ట్ చేయలేదు. సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ చాలా ఫేమస్. తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ, వాటికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అలాగే తన జిమ్ వీడియోలు, పెట్ డాగ్స్ తో ఆడుకుంటున్న వీడియోలు కూడా షేర్ చేస్తారు. కారణమేంటో ఆమె పూర్తిగా సైలెంట్ అయ్యారు. సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసి రోజులు గడిచిపోతున్నాయి.
ఇది ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది. ఎక్కడికెళ్ళావు సమంత దర్శనమివ్వు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బహుశా ఆమె షూటింగ్స్ లో బిజీగా ఉండవచ్చు. బాలీవుడ్ పై కన్నేసిన సమంత ఒకటి రెండు చిత్రాలు చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఇక తెలుగులో మూడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో యశోద, శాకుంతలం తెరకెక్కుతుండగా, విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రం చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్న సమంత ఒక్కసారి ఫ్యాన్స్ ని పలకరిస్తే బాగుండు.