Samantha: సమంత, చైతన్య తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విడాకులకు సంబంధించి ప్రకటన చేసిన తర్వాత నెట్టింట చైసామ్ విడిపోవడానికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. విడిపోయినా విడిపోవడానికి గల కారణాలను చెప్పకపోవడంతో అభిమానులకు సైతం చైతన్య, సమంత మధ్య ఏం జరిగిందో అర్థం కావడం లేదు. అయితే నెటిజన్లలో ఎక్కువమంది సమంతదే తప్పని కామెంట్లు చేస్తున్నారు.

సమంత పాపులర్ హీరోయిన్ కావడం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో గుర్తింపు ఉండటం, లేడీ ఓరియెంటెడ్ సినిమా ద్వారా సైతం ఆమె ఖాతాలో విజయాలు ఉండటం సమంత సక్సెస్ కు కారణమైంది. అయితే సమంత విడాకులు తీసుకోవడానికి ఆమె సన్నిహితులే కారణమని వినిపిస్తోంది. సమంత ఫ్యాషన్ డిజైనర్ తో కలిసి దిగిన ఫోటోలు సైతం ప్రస్తుతం నెట్టింట వైరల్ కాగా ప్రీతమ్ జుకల్కర్ విడిపోవడానికి కారణమయ్యాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే సమంతకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక కొత్త వార్త వినిపిస్తోంది. పిల్లలు పుడితే సినిమా ఆఫర్లు తగ్గుతాయని భావించి సమంత పెళ్లి తర్వాత అబార్షన్ చేయించుకున్నారని ఆ వార్తల సారాంశం. అయితే ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే చైతన్య, సమంతలలో ఎవరో ఒకరు స్పందించి స్పష్టత ఇవ్వాలి. విడాకుల వల్ల చైతన్య, సమంతలకు సంబంధించి కొత్త రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
చైతన్య, సమంత మధ్య గొడవలు వచ్చిన తర్వాత నాగార్జున సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని సమాచారం. నాగచైతన్య సమంతకు భరణం ఇస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరోవైపు సమంత, చైతన్య విడిగానే జీవనం సాగిస్తారా? లేక మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. సమంతకు ఈగో, పొగరు ఎక్కువని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.