Samantha: స్టార్ లేడీ సమంత ఓపెన్ గా మాట్లాడుతుంది. పలు విషయాల్లో సమంత తన అభిప్రాయం కుండబద్దలు కొట్టింది. ఒక మూవీ సక్సెస్ లో హీరో పాత్ర ఎంత ఉంటుందో? హీరోయిన్ పాత్ర కూడా అంతే ఉంటుంది? అలాంటప్పుడు హీరో-హీరోయిన్ రెమ్యూనరేషన్ మధ్య అంత వ్యత్యాసం ఎందుకు ఉంటుందని ఆమె ప్రశ్నించారు. కెరీర్ లో ఎదుగుతున్న క్రమంలో సమంత ఇలాంటి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. కారణం.. అలాంటి కామెంట్స్ ఆమె కెరీర్ ని దెబ్బతీయవచ్చు. స్టార్స్ నొచ్చుకుని అనధికారికంగా బ్యాన్ చేస్తే కెరీర్ ముగిసినట్లే.
కానీ సమంత నిర్భయంగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది. అలాగే సమంత ఓ సందర్భంలో ఆమె లవ్ స్టోరీని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సమంత మాట్లాడుతూ… సావిత్రి జీవితం నాకు పెద్దగా తెలియదు. మహానటి మూవీ షూటింగ్ సమయంలో సావిత్రి కి సంబందించిన చాలా విషయాలు నాకు తెలిసొచ్చాయి. సావిత్రి మాదిరి నేను కూడా ప్రేమలో మోసపోయే దాన్ని. కొంచెంలో తప్పుకున్నాను. లేదంటే నా జీవితం మరో సావిత్రిలా అయ్యేది, అన్నారు.
సావిత్రి జెమినీ గణేశన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే… ఆయన మరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అది తెలిసిన సావిత్రి మానసిక క్షోభకు గురైంది. చివరి రోజుల్లో జీవచ్ఛవంలా బ్రతికింది. అతన్ని వదిలించుకోకపోతే నా జీవితం కూడా దుర్బరం అయ్యేదని సమంత అన్నారు. ఈ వ్యాఖ్యలు హీరో సిద్దార్థ్ ని ఉద్దేశించి ఆమె చేశారనే వాదన ఉంది. సమంత-సిద్ధార్థ్ కలిసి జబర్దస్త్ అనే మూవీ చేశారు. 2013లో విడుదలైన ఈ చిత్రానికి నందినీ రెడ్డి డైరెక్టర్.
జబర్దస్త్ మూవీ సెట్స్ లో సమంత-సిద్ధార్థ్ ప్రేమలో పడ్డారని వినికిడి. అయితే సిద్ధార్థ్ మంచివాడు కాదు. అతనికి దూరంగా ఉండమని సమంతను సన్నిహితులు హెచ్చరించారట. కొన్నాళ్ళకు సిద్ధార్థ్ క్యారెక్టర్ అర్థం చేసుకున్న సమంత బ్రేకప్ చెప్పిందని టాలీవుడ్ టాక్. ఇక 2017లో సమంత హీరో నాగ చైతన్య వివాహం చేసుకుంది. వీరి బంధం కూడా సవ్యంగా సాగలేదు. కారణం తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2021 అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. ప్రస్తుతం సమంత సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది.
Web Title: Samantha had a tragic love story this was what she said
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com