Samantha And Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగేశ్వరరావు, నాగార్జునల తర్వాత నాగచైతన్య అంత గొప్ప క్రేజ్ నైతే సంపాదించుకున్నాడు. అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన కెరియర్ మొదటి నుంచి వరుస విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనకు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2017 లో వీళ్ళిద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ దాంపత్య జీవితం ఎక్కువ రోజుల పాటు నిలవలేకపోయింది..వల్ల మధ్య వచ్చిన గొడవల కారణంగా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు…ఇక ఆ తర్వాత 2024వ సంవత్సరంలో శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి కున్నాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరు అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారనే చెప్పాలి. అయితే నాగచైతన్య సమంత విడాకులకు కారణం ఏంటి అనే విషయం ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. నిజానికి వీళ్లిద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉందని చాలామంది వాళ్ళ పెళ్లి తర్వాత ప్రశంసించారు. అయినప్పటికి వాళ్ళ పెళ్లి జీవితం అనేది ఎక్కువ రోజుపాటు సాగకపోవడంతో అటు సమంతా అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు సైతం చాలావరకు ఇబ్బంది పడ్డారు. ఇక ఏది ఏమైనా కూడా సమంత నాగచైతన్యల మధ్య అండర్స్టాండింగ్ అనేది పర్ఫెక్ట్ గా కుదరకపోవడం వల్లే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారని గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. నిజానికి వీళ్ళిద్దరి మధ్య విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏదైనా కూడా నాగచైతన్య సమంతతో గొడవల్లో ఉన్నప్పుడు తనకు శోభిత ధూళిపాళ్ల దగ్గరైందనే వార్తలైతే వచ్చాయి.
శోభిత అంతకు ముందు నుంచే నాగ చైతన్య కి ఫ్రెండ్ గా ఉండటం వల్ల నాగ చైతన్య పెట్టిన ఒక పోస్ట్ కి తను రిప్లై పెట్టిందట… అప్పటిదాకా ఫ్రెండ్ గా ఉన్న శోభిత తో ఇంకాస్త పరిచయం ఎక్కువ ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే నాగ చైతన్య కి సమంతతో విడాకులు అవ్వడంతో తన ఐడియాలజీని అర్థం చేసుకునే శోభిత ను పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య ఫిక్స్ అయ్యాడట.
ఇక ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ప్రేమించకున్ను వీళ్ళు పెళ్లి చేసుకున్నారు…మొత్తానికైతే నాగచైతన్య ఆమెను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు… ఒక రకంగా చెప్పాలంటే సమంతతో విసిగిపోయిన నాగచైతన్య డిప్రెషన్ లో ఉన్నప్పుడు శోభిత పెట్టిన మెసేజ్లు తనకు రిలాక్సేషన్ గా ఉండేవట.
ఇక అలాగే వాళ్ళిద్దరూ కలిసి చాలాసేపు సినిమాల గురించి డిస్కషన్ చేసుకునేవారట. కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాని గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకునేవారు అంటూ గతంలో నాగచైతన్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు…