Saif Ali Khan: సైఫ్ అలీఖాన్.. ఈ మధ్య వయసు పై పడి డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు గాని, ఒకప్పుడు బాలీవుడ్ లోఆకతాయి హీరోగా సైఫ్ అలీఖాన్ కి మంచి పాపులారిటీ ఉండేది. పైగా తక్కువ సినిమాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో సైఫ్ అలీఖాన్ ప్రముఖుడు. అయితే, సైఫ్ జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి. చిన్నతనం నుంచి సైఫ్ వ్యక్తిత్వం విభిన్నమైనది. అందుకే, సైఫ్ అలీఖాన్ చుట్టూ అప్పట్లో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి.

ఇక ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సైఫ్ ‘ది కపిల్ శర్మ’ షోకి ముఖ్య అతిధిగా వచ్చాడు. అయితే, ఈ షోలో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) చాలా విషయాలే చెప్పుకొచ్చాడు. ఇంటిని అద్దెకు ఇచ్చే యజమాని బాధలు చాలా దారుణం అని తెలిపాడు. సైఫ్ మాటల్లోనే.. ‘నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నాది చాలా పాత మనస్తత్వం, అందుకే నేను ఫ్లాట్లలో పెట్టుబడులు పెట్టి, అద్దెకు ఇస్తుంటాను. కానీ చాలా సార్లు అద్దెకుండే వారు చాలా ఇరిటేట్ చేసేవాళ్లు’ అంటూ నవ్వుకుంటూ చెప్పుకొచ్చాడు.
‘మాట్లాడితే.. ఏసీ రిపేర్ ఉంది, వాటర్ లీకేజీలు ఉన్నాయంటూ వాళ్ళు ఫోన్ చేస్తుండేవారు. నాకు చిరాకు వచ్చేది. ఈ పనికి వేరే ఎవరినైనా పెట్టుకుంటే బాగుండు అనిపించేది. చివరకు, ఆ అద్దెకు ఉన్నవారి బాధ తట్టుకోలేకే ఓ మేనేజర్ ని పెట్టుకున్నాను’ అని సైఫ్ చెప్పుకొచ్చాడు.
ఇక సైఫ్ అలీ ఖాన్ సతీమణి కరీనా కపూర్ ఈ మధ్య రెండో సంతానంగా జెమ్ పుట్టాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సైఫ్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘ఆదిపురుష్’, ‘బంటీ ఔర్ బబ్లీ 2’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.