Samantha Fires On Media: ‘నీకు బుద్ధి ఉందా..? సమంత ఫైర్ !

Samantha Fires On Media: అక్కినేని సమంత (Samantha Akkineni) ఈ రోజు ఉదయం తిరుపతి వెళ్లారు. అక్కడ శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తుండగా ఓ జర్నలిస్ట్ ఆమెను ఒక ప్రశ్న అడిగాడు. ఇక అంతే.. కోపంతో ఊగిపోయింది సమంత. గత కొన్ని రోజులుగా సమంత – చైతు విడిపోతున్నారు అని ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. ఆ వార్త గురించే ఆ జర్నలిస్ట్ సమంతను అడిగాడు. మొదట ఆ ప్రశ్నకు ఆమె నవ్వుతూ అక్కడ […]

Written By: admin, Updated On : September 18, 2021 4:55 pm
Follow us on

Samantha Fires On Media: అక్కినేని సమంత (Samantha Akkineni) ఈ రోజు ఉదయం తిరుపతి వెళ్లారు. అక్కడ శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తుండగా ఓ జర్నలిస్ట్ ఆమెను ఒక ప్రశ్న అడిగాడు. ఇక అంతే.. కోపంతో ఊగిపోయింది సమంత. గత కొన్ని రోజులుగా సమంత – చైతు విడిపోతున్నారు అని ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. ఆ వార్త గురించే ఆ జర్నలిస్ట్ సమంతను అడిగాడు.

మొదట ఆ ప్రశ్నకు ఆమె నవ్వుతూ అక్కడ నుంచి ముందుకు కదిలారు. కానీ ఆ జర్నలిస్ట్ ఆమెను వదలలేదు. సమంత చుట్టూనే తిరుగుతూ మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈ ప్రశ్న చాలా రోజులుగా వార్తల్లో నానుతుంది. దీనికి మీరు స్పందించాలి అంటూ అతను సమంతను పదే పదే అదే ప్రశ్న అడగడంతో మొత్తానికి సమంతకి కోపం రెట్టింపు అయింది.

చిర్రెత్తుకొచ్చిన్నట్టుగా అతని పై విరుచుకు పడుతూ.. ‘నీకు బుద్దుందా..? ఏ సమయంలో ఏం అడుగుతున్నావ్ ? నేను వచ్చింది దైవదర్శనానికి అని నీకు తెలియదా ? అంటూ సమంత అతని పై ఫైర్ అయింది. ఎప్పుడు లేనిది సమంతలో అంత కోపాన్ని చూసిన సదరు జర్నలిస్ట్ షాక్ అయ్యాడు.

చివరకు ఆ జర్నలిస్ట్ సమంత కోపానికి భయపడుతూ బిక్కమొహం పెట్టాల్సి వచ్చింది. ఇంతకీ సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారా ? లేదా ? అనేది ఇప్పటికీ క్లారిటీ అయితే రాలేదు.

ఇటు సమంతతో పాటు అటు చైతు కూడా ఇప్పటివరకు ఈ పుకార్ల పై స్పందించడానికి ఆసక్తి చూపించలేదు. కనీసం రానున్న రోజుల్లో నైనా ఈ పుకార్లకు సమంత, నాగ చైతన్య ఫుల్ స్టాప్ పెట్టాలని ఆశిద్దాం.