Samantha Ruth Prabhu : సెలబ్రిటీలు కూడా మన లాంటి సాధారణమైన మనుషులే, వాళ్ళేమి పైన నుండి దిగి రాలేదు అనే వాస్తవాన్ని కొంతమంది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఫోటో గ్రాఫర్లు. దారిలో సెలబ్రిటీలు కనిపిస్తే చాలు, వాళ్ళని ఆపించి ఫోటోలు, వీడియోలు కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళని నిరాశ పర్చకుండా ప్రత్యేకంగా ఫోటోలు ఇస్తుంటారు సెలబ్రిటీలు. కానీ వాళ్ళ మూడ్ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. వాళ్లకు కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితం లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎల్లపుడూ నవ్వుతూ ఫోటోలు ఇవ్వలేరు. ఇది అర్థం చేసుకోవాలి. రీసెంట్ గా ముంబై లో హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) ని ఫోటోగ్రాఫర్స్ చాలా ఇబ్బందికి గురి చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసిన వారంతా అయ్యో పాపం సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే సమంత ముంబై లోని ఒక జిమ్ సెంటర్ లో వర్కౌట్స్ చేసి బయటకు వచ్చింది. సాధారణంగా హీరోయిన్స్ జిమ్ నుండి బయటకు రాగానే వాళ్లకు సమందించిన కార్ రెడీ గా ఉంటుంది. కానీ సమంత కార్ మాత్రం సమయానికి అక్కడ లేదు. దీంతో ఆమె తన డ్రైవర్ కి ఫోన్ చేసి సీరియస్ గా మాట్లాడుతూ ఉంది. ఇంతలోపు ఫోటోగ్రాఫర్స్ ఆమెని చుట్టుముట్టి ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. దీంతో చిరాకు పడిన సమంత ‘దయచేసి ఆపండి ప్లీజ్..ఏంటి మీరు ఇలా ఉన్నారు’ అని అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆమె లోపలకు వెళ్ళిపోతుంది. కార్ వచ్చిన తర్వాత మళ్ళీ బయటకి వచ్చిన సమంత ని ఫోటోలు తీసేందుకు ప్రయత్నం చేయగా, ‘అబ్బా ఆపండి ప్లీజ్’ అంటూ ఇంగ్లీష్ లో అరిచి కార్ ఎక్కి వెళ్ళిపోయింది. ఎదో హడావుడి లోనో, లేదా బ్యాడ్ మూడ్ లోనో సమంత ఉందని అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇంతకు ముందు కూడా ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేసి బయటకు వస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు అడగ్గా కావాల్సినన్ని ఇచ్చి వెళ్ళింది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఎదో బ్యాడ్ మూడ్ లో ఉంది. అసలే చమట్లతో చిరాకు పడుతున్న సమయంలో ఆమె చుట్టుముట్టి అంత ఇబ్బంది పెట్టడం అవసరమా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ వీడియో క్రింద కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే సమంత చాలా కాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇప్పుడు సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి ఆమె నిర్మాతగా మారి ‘శుభమ్’ అనే చిత్రాన్ని నిర్మించి విడుదల చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. రీసెంట్ గానే ఓటీటీ లో కూడా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
stop it guys … ஜிம்மிற்கு சென்று வரும் போது தன்னை வீடியோ எடுத்தவர்களை திட்டிய சமந்தா#Samantha #gym #viralvideo #Cinema #tnrepublic pic.twitter.com/3ilHyYbiTW
— TNRepublicnews (@TNRepublicnews) June 17, 2025