Samantha Father Facebook Post: టాలీవుడ్ లో అత్యంత ప్రియమైన జంటగా ఒక్కటైన నాగ చైతన్య -సమంతా పెళ్లి మున్నాళ్ల ముచ్చటగా మారి విడిపోయారు. వీరి విడాకులు టాలీవుడ్ లోనే కాదు.. అన్ని చిత్ర పరిశ్రమలలో అందరినీ కలిచివేశారు. వారి కుటుంబాలు.. అభిమానులతో సహా చాలా మంది హృదయాలను విచ్ఛిన్నం చేశాయి.

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కూడా తన కుమార్తె విడాకులపై తాజాగా స్పందించారు. సమంత, నాగ చైతన్య విడిపోయారని తెలిసినప్పటి నుంచి తన మైండ్ బ్లాంక్ అయిందని చెప్పాడు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, అయితే సమంత నిర్ణయాన్ని ఒప్పుకుంటున్నట్లు తెలిపాడు. సమంత, చైతన్య తనకు ఎంతో ఇష్టమని, చైతో గడిపిన సమయాన్ని తన కుటుంబం ఎప్పుడూ మరిచిపోదని పేర్కొన్నాడు.

తాజాగా జోసెఫ్ ప్రభు ఇటీవల తన ఫేస్‌బుక్ ఖాతాలో సామ్ – చైతన్యల వివాహ చిత్రాలను షేర్ చేసి కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ జంట తమ జీవితాల్లో ముందుకు సాగాలని ఆశించిన్నప్పటికీ సామ్ కుటుంబం ఇప్పటికీ నాగ చైతన్యను మరచిపోలేదని ఈ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఇంత అందమైన జంట విడాకులు తీసుకుని వేరు వేరు మార్గాల్లోకి వెళ్లిందన్న వాస్తవాన్ని సమంత తండ్రి ఇంకా తట్టుకోవడం లేదని ఆయన పోస్ట్ ద్వారా అర్థమవుతోంది. జోసెఫ్ ప్రభు లాగే ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో చైతన్య అభిమానులు పంచుకొని వైరల్ చేస్తున్నారు. వీరి విడిపోవడం హృదయ విదారకం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.