Samantha Emotional Comments: కొంత గ్యాప్ తర్వాత సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాల తర్వాత , ఈ చిత్రమే కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. బయ్యర్స్ కి మూడింతల లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా సమంత తన మూవీ టీం తో కలిసి నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ చిత్రం గురించి , అదే విధంగా తన మొదటి వైవాహిక జీవితం లోని అనుభవాలను నేటి తరం స్త్రీలకు చెప్తూ ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఒక రిపోర్టర్ సమంత ని ప్రశ్న అడుగుతూ ‘ప్రతీ మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటుంటారు, కానీ మీ జీవితం లోకి ఆయన వచ్చిన తర్వాత మొదటి సక్సెస్ ని ఎదురుకున్నారు. ఒక అబ్బాయిని ఎంచుకునే అమ్మాయిలు ఈమధ్య చాలా తడబడుతున్నారు, అలాంటి వారికి మోటివేషన్ గా మీరేమి చెప్తారు’ అని అడుగుతారు. అందుకు సమంత సమాధానం చెప్తూ ‘కెరీర్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ రిలేషన్ షిప్స్ మాత్రం మన చేతుల్లో ఉండదు. నేను నా అనుభవాలతో అర్థం చేసుకున్నది ఏమిటంటే మన మీద మనకు పూర్తిగా ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే మనం సరైన వాళ్ళని మన జీవిత భాగస్వాములు గా ఎంచుకోగలం. కానీ ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం లేకుండా, అసంపూర్ణ భావం తో ఉంటూ , అతను నీ జీవితం లోకి వస్తేనే సంపూర్ణం అవుతుందని అనుకున్నప్పుడే తప్పులు జరుగుతాయి. ఎందుకంటే మనకు జీవిత భాగస్వామి పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అది కరెక్ట్ కాదు, నేను మహిళలకు ఇచ్చే అతి ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఎదుటి వ్యక్తి మీద ఆధారపడాలి అనుకోకండి, మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.
ఇదంతా ఆమె నాగ చైతన్య తో వైవాహిక జీవిత అనుభవాలను ఆధారంగా తీసుకొనే చెప్పిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇకపోతే గత కొంతకాలం నుండి సమంత గర్భం దాల్చింది అనే ప్రచారం సోషల్ మీడియా బాగా ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాల గ్యాప్ తర్వాత వచ్చారు , ఇకపై గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్న కి , సమంత సమాధానం చెప్తూ ‘దయచేసి క్షమించండి , ఇప్పుడు గర్భం తో ఉన్నాను , మెటర్నిటీ లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పేసింది. స్వయంగా ఆమెనే ఈ విషయాన్ని చెప్పడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
