‘అక్కినేని సమంత’కు చైతుతో పెళ్లికి ముందు సినిమాకి ఎనభై లక్షల నుండి కోటి రూపాయిలు వరకూ ఇచ్చేవారు. ఇక పెళ్లి తరువాత హీరోయిన్ కి అవకాశాలే ఇవ్వరు, అలాంటిది కోట్ల రూపాయిల పారితోషికం ఎందుకు ఇస్తారు, ఇది అనాదిగా వస్తోన్న ఆనవాయితీ కూడా. సావిత్రి లాంటి మహానటి కూడా ముప్పై ఐదేళ్ళు దాటగానే సైడ్ క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది.
కానీ ఆ ఆనవాయితీని సమంత బ్రేక్ చేసిందనే చెప్పాలి. పైగా పెళ్లి తరువాతే సమంత కెరీర్ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకి తీసుకునే పారితోషికం అక్షరాల 2 కోట్లు. అక్కినేని బ్రాండ్ సమంతకు బాగా ప్లస్ అయింది. ఇక ప్రస్తుతం గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ సినిమాకి అయితే మూడు కోట్లు వరకు సమంత తీసుకొందని తెలుస్తోంది.
పైగా ఆ సినిమా కోసం సమంత కొంత పెట్టుబడి కూడా పెడుతుంది. అయితే తాజాగా సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సిరీస్ సమంత ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మెయిన్ పాయింట్. అయితే, సమంత టీమ్ లోని సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఈ వెబ్ సిరీస్ చేయడానికి మెయిన్ కారణం ‘పారితోషికం’.
ఈ వెబ్ సిరీస్ మేకర్స్ సమంతకు ఏకంగా మూడు కోట్ల నలభై లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక సినిమాకి ఎన్ని రోజుల వర్క్ చేయాల్సి వస్తోందో.. అన్ని రోజులు సమంత ఈ వెబ్ సిరీస్ కోసం పని చేసిందట. అందుకే, పారితోషికం కూడా భారీగానే ముట్టింది. పైగా ఈ సిరీస్ కారణంగా సమంతకు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. ఆమెకు కొత్త ఫాలోవర్స్ పెరిగారు. ఈ సిరీస్ తో సమంతకు మరిన్ని సిరీస్ లు వచ్చే ఛాన్స్ ఉంది.