Pushpa: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ ఓ పల్లెటూరి మొరటోడి లుక్‌లో కనిపించనున్నారు. సుకుమార్ తొలిసారి పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఇందులో రష్మిక హీరోయిన్గా కనిపించనుంది. అయితే, ఇటీవల ఈ సినిమాలోని ఐటెం సాంగ్‌లో సమంత నటించనుందంటూ.. నెట్టింట వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ పుష్ప మేకర్స్ కూడా అనౌన్స్ చేశారు. సమంత పుష్పలో నటిస్తోందంటూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో సినిమాలోని ఐటెం సాంగ్‌పై మరింత ఆసక్తి పెరిగింది.

అయితే, తాజా సమాచారం ప్రకారం, సమంత ఈ పాటకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 1.5 కోట్లు సమంత తీసుకుంటున్నట్లు సమాచారం. సౌంత్ ఇండియాలోనే ఈ రెమ్యునరేషన్ రికార్డుగా తెలుస్తోంది. ఈ సాంగ్‌ను కూడా దేవిశ్రీ ప్రసాద్ అదే లెవెల్లో కంపోజ్ చేయ్యగా.. ఐదో సాంగ్‌గా ఈ పాటను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరి రోజురోజుకు అంచనాలు రేకెత్తిస్తోన్న పుష్ప.. బిగ్స్క్రీన్పై ఎలా అలరించనుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం చివర భాగం చిత్రీకరణ జరుపుకుంటున్న పుష్ప.. ఈ ఏడాది డిసెంబరు17న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. మరి అనుకున్న అంచనాలను చేరుకుంటుదో లేదో చూడాలి.