Samantha Costly Car: టాలీవుడ్ టాప్ స్టార్ సమంత ఇప్పుడు ట్రెండీ హీరోయిన్ గా మారింది. ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది . ఆమె ఏం చేసినా వైరల్ అవుతుండడం విశేషం తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ ఖరీదైన కారు నుంచి దిగి ఎయిర్ పోర్టులోకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. ఈ కారు తనదే అని కొందరు అంటుండగా… సామ్ కారు కాదని మరికొందరు వాదిస్తున్నారు. ఇంతకీ ఆ కారు సంగతేంటో చూద్దాం.

అక్కినేని నాగచైతన్యతో విడాకుల ప్రకటన తరువాత శ్యామ్ రెచ్చిపోతుంది. నిత్యం హాట్ హాట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. ఇటీవల సమంతో ఓ యాడ్ ఫిలిం షూటింగ్లో భాగంగా బికినీ అవతారమెత్తింది. ఇందుకు సంబంధించిన పిక్స్ సమంత తన ఇన్ స్ట్రాగ్రాంలో ఉంచింది. అవి అప్లోడ్ చేసిన కాసేపట్లోనే నెట్టింట దుమారం లేపాయి. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ హీరోయిన్ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందాల ఆరబోత విషయంలో తగ్గేదేలే అన్నట్లు హాట్ షో చేస్తోంది సమంత.
తాజాగా ఈ అమ్మడు ఓ కారులో నుంచి దిగి ఎయిర్ పోర్టు వైపు నడుచుకుంటూ వెళ్లింది. అయితే ఈ కారు రోల్స్ రాయ్స్ అని కొందరు అంటున్నారు. ఈ కారును సమంత సొంతం చేసుకుందని ఓ నెటిజన్ అనగా.. సమంతది కాదని కొందరు అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే లెవల్లో సమంత మెయింటేన్ చేస్తోందని అంటున్నారు. కానీ సమంత కారు దిగి ఎయిర్ పోర్టులోకి వెళ్లిన లుక్స్ మాత్రం అదిరిపోయాయిని అంటున్నారు. అయితే ఈ కారు తనదో కాదో సమంత మాత్రమే చెప్పాలని మరో నెటిజన్ మెసేజ్ పెట్టారు.

ఇప్పటికే డ్రెస్సింగ్ విషయంలో సమంత ప్రత్యేకంగా నిలుస్తోంది. కొందరు ఆమె డ్రెస్సింగ్ విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సమంత మాత్రం అవేమీ పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు వ్యవహరిస్తోంది. ఇక సమంత నటించిన శాకుంతల సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈమధ్యే విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే సమంత మాత్రం బాలీవుడ్ రేంజ్ కు ఎదగాలని చూస్తుందట. మరి ఈ అమ్మడు బాలీవుడ్ లో ఏ సినిమాతో ఆరంగేట్రం చేస్తుందో చూడాలి.
Also Read:Priyanka Chopra: బ్రా లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?


[…] […]
[…] […]