Samantha Ruthprabhu : ప్రొఫెషనల్ గా దూసుకెళ్తున్న సమంత పర్సనల్ గా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. వెంటవెంటనే సమంతకు రెండు దెబ్బలు తగిలాయి. భర్త నాగచైతన్యతో మనస్పర్థలు తలెత్తాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో విడాకులు తీవ్ర మానసిక వేదనకు గురి చేశాయి. దానికి తోడు సమాజం సూటిపోటి మాటలు. నీదే తప్పని నిందలు. సమంత కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. సినిమాల్లో బిజీ అయిన సమంత విడాకుల డిప్రెషన్ నుండి కొంతలో కొంత బయటపడ్డారు. అంతలోనే ఆమెను అనారోగ్యం వెంటాడింది. అరుదైన మయోసైటిస్ వ్యాధికి గురయ్యారు.

ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకున్నారు. అందరికీ తెలిసి సమంత మూడు నెలలకు పైగా మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటున్నారు. ఆమె కోలుకున్న దాఖలాలు లేవు. ఇటీవల సమంత శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆమెలో ఒకప్పటి ఎనర్జీ కనిపించలేదు. మానసిక ప్రశాంత కూడా ఆమె ఈ వ్యాధి వలన కోల్పోయారు అనిపిస్తుంది. సమంత కొన్ని ఆధ్యాత్మిక పద్ధతులు పాటిస్తున్నారు. ఎప్పుడూ చేతిలో జపమాల ఉంచుకుంటున్నారు.
అలాగే సమంతకు ఓదార్పునిచ్చే ఇద్దరు ముఖ్యనవారు ఉన్నారు. వారి పేర్లు హ్యాష్, సాషా. అవి సమంత పెట్ డాగ్స్ నేమ్స్. సమంత వద్ద చాలా కాలంగా హ్యాష్ పెరుగుతుంది. తర్వాత దానికి జంటగా సాషాను తెచ్చుకుంది. ఈ రెండు అంటే సమంతకు ప్రాణం. వాటిని సొంత బిడ్డలతో సమానంగా చూసుకుంటారు. ఇంట్లో సమంతకు వాటితో ఆడుకోవడం ఇష్టమైన పని. తాజాగా సమంత ఒక పోస్ట్ పెట్టారు. రెండు పెట్ డాగ్స్ తో పాటు ఫోటో దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకి కామెంట్ గా… ” నీ వెనుక నేను ఉన్నాను అమ్మా… ధైర్యంగా ఉండు” అని కామెంట్ పెట్టింది.
ఆ పెట్ డాగ్స్ లో ఒకటైన హ్యాష్ తన కొడుకుగా ఆమెకు ధైర్యం చెబుతున్నాడు… అని అర్థం వచ్చేలా సమంత ఆ కామెంట్ పోస్ట్ చేయడం జరిగింది. సమంత హైదరాబాద్ లో గతంలో నాగ చైతన్యతో కాపురం చేసిన ఇంటిలోనే ఉంటున్నారు. అది మురళీ మోహన్ కి చెందిన అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లో పైన ఒక పెంట్ హౌస్ ఉంది. అది మురళీ మోహన్ దగ్గర కొనుక్కొని చైతు, సమంత ఉండేవారు. విడిపోవడానికి ముందు ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్మేశారు. విడాకుల అనంతరం సమంత ఆ ఇల్లు కావాలని అధిక ధర చెల్లించి సొంతం చేసుకున్నారు.