https://oktelugu.com/

Samantha Divorce Reason: కాఫీ విత్ కరణ్ షోలో సమంత బరస్ట్… విడాకుల ఎందుకో చెప్పి చైతూకు షాక్!

Samantha Divorce Reason: నాగ చైతన్య, సమంత విడాకులు ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్. 2021లో అక్టోబర్ లో చై, సామ్ సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. అధికారిక ప్రకటనకు ముందు నుండే మీడియాలో వీరి డివోర్స్ వార్తలు హల్చల్ చేశాయి. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకుంటున్నారంటే జనాలు కారణాలు వెతకడం మొదలుపెడతారు. ఈ క్రమంలో అనేక పుకార్లు […]

Written By:
  • Shiva
  • , Updated On : June 20, 2022 / 09:47 AM IST

    Samantha Divorce Reason

    Follow us on

    Samantha Divorce Reason: నాగ చైతన్య, సమంత విడాకులు ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్. 2021లో అక్టోబర్ లో చై, సామ్ సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. అధికారిక ప్రకటనకు ముందు నుండే మీడియాలో వీరి డివోర్స్ వార్తలు హల్చల్ చేశాయి. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకుంటున్నారంటే జనాలు కారణాలు వెతకడం మొదలుపెడతారు. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి.

    Samantha, Chaitanya

    ఎక్కువగా సమంతనే విమర్శలు ఎదుర్కొంది . ఆమెకు పిల్లలంటే ఇష్టం లేదని, అలాగే తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జువాల్కర్ తో సన్నిహితంగా ఉండటం నచ్చక చైతన్య విడాకులు ఇచ్చారంటూ పలు కథనాలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలను సమంత ఖండించారు. మానసిక వేదన అనుభవిస్తున్న తనను ఇలాంటి వార్తలతో ఇబ్బంది పెట్టొద్దని మీడియా సంస్థలను విజ్ఞప్తి చేస్తుంది. ఎంతకూ వినకపోవడంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై న్యాయపోరాటానికి దిగింది.

    Also Read: Viral: చెల్లి పెళ్లికి చనిపోయిన తండ్రిని ఆ అన్నయ్య ఇలా తీసుకొచ్చాడట?

    ఇదిలా ఉంటే విడిపోవడానికి ముందు సమంత-చైతన్య మధ్య పెద్ద వ్యవహారమే నడిచింది. దానికి సమంత సోషల్ మీడియా పోస్ట్స్ నిదర్శనం. విడాకులు ముందు తర్వాత చాలా కాలం సమంత అక్కినేని ఫ్యామిలీని ,నాగ చైతన్యను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ చేశారు. పరోక్షంగా ఆమె అన్యాయానికి గురైనట్లు, కొందరు ఇబ్బందులకు గురి చేసినట్లు ఆమె కొటేషన్స్ ఉండేవి మరోవైపు నాగ్ ఫ్యామిలీ మాత్రం పూర్తిగా సైలెంట్.

    Samantha

    అసలు ఏం జరిగింది? ఎందుకు విడాకులు తీసుకున్నారనేది? ఎవరికీ తెలియదు. ఎట్టకేలకు సమంత ఈ విషయంపై నోరు విప్పినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా కాఫీ విత్ కరణ్ లేటెస్ట్ సీజన్ మొదలు కానుంది. అత్యంత బోల్డ్ షోగా పేరుగాంచిన కాఫీ విత్ కరణ్ లో సమంత పాల్గొన్నట్లు సమాచారం. షూటింగ్ కూడా పూర్తయిన ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుందట. ఈ షోలో సమంత విడాకుల వివాదంపై నోరు విప్పారని అంటున్నారు. అదే సమయంలో ఆమె కామెంట్స్ చైతన్యతో పాటు అక్కినేని ఫ్యామిలీకి షాక్ ఇచ్చే సూచనలు కలవు అంటున్నారు. ఇదే నిజమైతే ఈ వివాదం మరికొన్నాళ్లు కొనసాగుతుంది.

    Also Read: Thalapathy 66: విజయ్ ఫ్యాన్స్ కి భారీ సర్పైజ్… తలపతి 66 నుండి ఫస్ట్ లుక్!

    Recommended Videos:


    Tags