https://oktelugu.com/

Samantha: సమంత ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​!

Samantha: నాలుగేళ్ల క్రితం విహాహం చేసుకొని ఇటీవలె విడాకులతో అందరికీ షాక్​ ఇచ్చారు చై- సామ్​ జంట. ఆరేళ్ల ప్రేమ, నాలుగేళ్ల వివాహ బంధం కలిసి మొత్తం పదేళ్ల జీవితానికి ముగింపు పలికారు. ఈ క్రమంలోనే సోషల్​ మీడియా, టీవీ చానెల్స్​లో గత కొన్నిరోజులుగా వీరి విడాకుల వార్తలే వినిపిస్తున్నాయి. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా వీరిద్దరూ తమ కెరీర్​పై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైతూ థాంక్యూ మూవీ షూటింగ్​తో బిజీ అయ్యారు. మరోవైపు సమంత […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 15, 2021 / 05:57 PM IST
    Follow us on

    Samantha: నాలుగేళ్ల క్రితం విహాహం చేసుకొని ఇటీవలె విడాకులతో అందరికీ షాక్​ ఇచ్చారు చై- సామ్​ జంట. ఆరేళ్ల ప్రేమ, నాలుగేళ్ల వివాహ బంధం కలిసి మొత్తం పదేళ్ల జీవితానికి ముగింపు పలికారు. ఈ క్రమంలోనే సోషల్​ మీడియా, టీవీ చానెల్స్​లో గత కొన్నిరోజులుగా వీరి విడాకుల వార్తలే వినిపిస్తున్నాయి. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా వీరిద్దరూ తమ కెరీర్​పై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైతూ థాంక్యూ మూవీ షూటింగ్​తో బిజీ అయ్యారు. మరోవైపు సమంత దసరా కానుకగా ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​ ప్రకటించింది.

    ఇటీవలె శాకుంతలం సినిమా షూటింగ్​ పూర్తి చేసుకున్న సమంత.. తన తర్వాత సినిమాను ప్రకటించింది.  శాంతరూబన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు తెలిపింది సమంత. డ్రీం వారియర్స్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్నట్లు పేర్కొంది. తెలుగు, తమిళంలో కలిపి ద్వి భాష చిత్రంగా తెరకెక్కనుంది. లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఇటీవలె ఫ్యామిలీ మాన్ సిరీస్​తో నార్త్​లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

    ఇటీవలె నాగ చైతన్య హీరోగా వచ్చిన లవ్​స్టోరీ బాక్సాఫీసు వద్ద హిట్​ కొట్టిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్​గా అలరించింది. శేఖర్​కమల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరన లభించింది. మరోవైపు వీరి విడాకులపై వస్తున్న వరుస కథనాలపై ఎటువంటి స్పందన ఇవ్వకుండా.. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. దీనిపై కొంతమంది విమర్శలు గుప్పిస్తుండగా.. మరికొంత మంది అది వారి వ్యక్తిగతమని.. తమకు ఇష్టమొచ్చినట్లు ఉండటం వారి హక్కు అని భావిస్తున్నారు.