Samantha, Trisha, Keerthy Suresh: నేటి తరం హీరోయిన్ల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అదే ఒకప్పుడు అయితే స్టార్ హీరోయిన్ల మధ్య గట్టి పోటీ ఉండేది. ఒకరి పట్ల ఒకరు దురుసుగా ప్రవర్తించేవారు. కానీ, ఈ జనరేషన్ స్టార్ హీరోయిన్లు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. శృతి హాసన్ తో తమన్నాకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సమంత, కీర్తి సురేష్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే రకుల్ – సమంత కూడా చాలా క్లోజ్ గా ఉంటారు.
మొత్తానికి నలుగురు, ఐదుగురు హీరోయిన్లు కలిస్తే.. అక్కడ ఇక పార్టీలే. తాజాగా త్రిష, కీర్తి సురేష్, కళ్యాణ్ ప్రియదర్శన్, సమంత చెన్నైలో కలిశారు. ఎందుకు కలిశారో తెలియదు గానీ, కలిసిన సందర్భంగా మంచి పార్టీ అయితే చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పార్టీ తాలూకు ఫోటోలను, వీడియోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
దాంతో ఈ హీరోయిన్ల పార్టీ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. సమంత గత కొన్ని రోజులుగా చెన్నైలోనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార అండ్ విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.
అయితే. ఈ సినిమా షూట్ చెన్నైలోని ఓ స్టూడియోలో జరుగుతుందట. కాగా అదే స్టూడియోలో త్రిష, కీర్తి సురేష్ వేరే సినిమాల షూట్ లో ఉన్నారు. ఇక అందరూ ఒకే చోట ఉండటంతో మొత్తానికి అందరూ కలిసి గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. ఏది ఏమైనా సమంత తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోకుండా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం నిజంగా విశేషమే.