https://oktelugu.com/

Narendra Modi : మన్‌కీ బాత్‌లో మోదీ ప్రస్తావించిన కర్తుంబి గొడుగు ప్రత్యేకత ఏంటి?

Narendra Modi : మహిళలకు అదనపు ఆదాయ వనరుగా ఉండేలా గొడుగుల తయారీని రూపొందించారు. ఇది కాలానుగుణంగా ఉంటుంది, ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది కేరళలో (జూన్‌) వర్షాకాలం మొదలయ్యేనాటికి గొడుగులు సిద్ధంగా ఉంటాయి.

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2024 / 03:14 PM IST

    Karthumbi Umbrella

    Follow us on

    Narendra Modi – Karthumbi Umbrella : కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ తన 111వ మన్‌కీబాత్‌లో ఆదివారం మాట్లాడారు. ఈ రేడియో కార్యక్రమంలో కేరళలోని గిరిజన మహిళలు తయారు చేసే కర్తుంబి గొడుగును మోదీ ప్రస్తావించారు. 2014లో ప్రారంభమైన ఈ గొడుగులను కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా అట్టప్పాడిలో గిరిజనులు తయారు చేస్తారు. మోదీ మన్‌కీ బాత్‌లో వర్షాకాలం గురించి ప్రస్తావిస్తూ.. కర్తుంబి గొడుగు గురించి తెలిపారు ‘ఈ రంగు రంగుల గొడుగులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ గొడుగులను కేరళ గిరిజన సోదరీమణులు తయారు చేస్తారు. అట్టప్పాడిలో గిరిజన మహిళలు ఇప్పటివరకు సుమారు 3 లక్షల గొడుగులను తయారు చేశారు. ఇది దశాబ్దం క్రితం శిశు మరణాల కారణంగా వార్తల్లోకి వచ్చింది. ఇది గిరిజన సమాజం యొక్క ఉనికికి ముప్పుగా ఉంది. అని పేర్కొన్నారు.

    మాతాశిశు సంరక్షణకు చర్యలు..
    ఇంకా ప్రధాని మన్‌కీ బాత్‌లో అట్టప్పాడిలో తలుల్ల అనారోగ్యకరమైన శిశువులకు జన్మనివ్వడానికి పోషకారలోపంతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కారణంగా పుట్టిన శిశువులు కూడా మరణిస్తున్న విషయం వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు. గొడుగుల కారణంగా గిరిజనుల జీవణ ప్రమాణాల, ఆరోగ్యం మెరుపర్చాల్సిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చడానికి చేసిన ఆలోచనల్లో గిరిజనులకు ఆదాయ వనరుగా మారడానికి గొడుగుల తయారు చేయడం ప్రారంభించారని వెల్లడించారు. ఇందుకు చొరవ తీసుకున్నది అట్టప్పాడి గిరిజన సంక్షేమ సంస్థ తంబు అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

    కర్తుంభి ప్రత్యేకత ఇదీ..
    ఇక ‘కర్తుంబి’ అట్టప్పాడిలో గిరిజన పిల్లల సాంస్కృతిక బృందం. గొడుగు దానిని బ్రాండ్‌ పేరుగా స్వీకరించింది. 2014లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దాదాపు 50 మంది గిరిజన మహిళలకు గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. వీరిలో పది మందికి అట్టప్పాడి వెలుపల నిపుణుల శిక్షణ ఇచ్చారు. ప్రారంభ మూడేళ్లలో, దుబాయ్‌కి చెందిన పీస్‌ కలెక్టివ్, గొడుగు ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహాయాన్ని అందించింది. 2017లో రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ రూ.17 లక్షల రివాల్వింగ్‌ ఫండ్‌ ఇచ్చింది. 2014లో 1,000 గొడుగులు ఉండగా, 2024లో సంవత్సరానికి 17,000 గొడుగులను విక్రయించే స్థాయికి వెంచర్‌ పెరిగింది. ఇక శిక్షణ పొందిన గిరిజన మహిళల సంఖ్య 50 360కి పెరిగింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నారు. మహిళలకు అదనపు ఆదాయ వనరుగా ఉండేలా గొడుగుల తయారీని రూపొందించారు. ఇది కాలానుగుణంగా ఉంటుంది, ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది కేరళలో (జూన్‌) వర్షాకాలం మొదలయ్యేనాటికి గొడుగులు సిద్ధంగా ఉంటాయి.