టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హోదాను సంపాదించుకొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు అందుకొని వరుసగా వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో అవకాశాలు అందుకుంది.
ఇక అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సమంతకు అవకాశాలు అస్సలు తగ్గలేదు. పైగా తన భర్త నాగచైతన్య తో కూడా నటించింది. సమంతకు అక్కినేని కోడలు అయ్యాక మరింత హోదా అందిందనే చెప్పవచ్చు. కొన్ని బిజినెస్ లు కూడా ప్రారంభించి బిజినెస్ ఉమెన్ గా నిలిచింది.
అలా అక్కినేని వారి కోడలుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సామ్, చైతూల జంటను చూసి ఎంతోమంది మురిసిపోయారు. క్యూట్ కపుల్ అని పేరు కూడా పెట్టేశారు. కానీ ఏం జరిగిందో తెలియదు గానీ ఇటీవలే సమంత, నాగచైతన్య విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అభిమానులతో సహ అక్కినేని కుటుంబం చాలా బాధపడింది.
ఇక సమంత మాత్రం తన విడాకుల గురించి కారణం చెప్పకపోగా మొత్తానికి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో కూడా ఇంతకుముందు ఎలా ఉందో అలాగే మూవ్ అవుతుంది. ఇదిలా ఉంటే సమంత ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలు పంచుకుంది.
అందులో ‘న్యూ బ్రింగింగ్ బ్యాక్’ అంటూ ఇంటికి సంబంధించిన ఫోటోను పంచుకుంది. ఈ ఫోటోను గమనించినట్లయితే.. సమంత ఇదివరకు నాగచైతన్య తో కలిసి ఉన్న ఇంట్లోనే ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక సమంత శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. పైగా మరిన్ని అవకాశాలు కూడా అందుకుంటుంది.