Bollywood Trends: బాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కత్రినా పెళ్లి విషయంలో సల్మాన్ ఖాన్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు అని రూమర్స్ వినిపించాయి. అయితే, తాజాగా కత్రినా పెళ్లి పై సల్మాన్ ఖాన్ స్పందించాడు. ‘కంగ్రాట్స్ కత్రినా.. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలి. మీ వివాహంతో అందరూ సంతోషంగా ఉన్నారు’ అని బిగ్ బాస్-15 ఫైనల్ సందర్భంగా సల్మాన్ అన్నాడు. ఆ మాటకు ‘మీరు సంతోషంగా ఉన్నారా..?’ అని నటి షెహనాజ్ గిల్ అడగ్గా.. ‘సింగిల్ అయినప్పుడే నేను మరింత సంతోషంగా ఉంటా’ అని సల్మాన్ బదులిచ్చాడు.

బిగ్‌బాస్-15 విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతంటే..?
ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. హిందీ బిగ్ బాస్ సీజన్-15 ముగిసింది. అయితే, 24 మంది సెలబ్రిటీలతో 120 రోజుల పాటు అలరించిన ఈ సీజన్ విజేతగా బుల్లితెర నటి తేజస్వి ప్రకాష్ నిలిచింది. బిగ్ బాస్-15 టైటిల్ ట్రోఫీతో పాటు రూ.40లక్షలు క్యాష్ ప్రైజ్ అందుకుంది. ఈ విజయంతో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. హిందీ సీరియల్ ‘నాగిని’ సీక్వల్‌లో కీ రోల్ ఆమె దగ్గరికి వచ్చింది. కాగా.. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు ఆమె థాంక్స్ చెబుతూ సంతోషంతో ఊగిపోతోంది.

Also Read: గోపీచంద్.. సాంగ్ ప్రోమోలో కూడా ‘పక్కా కమర్షియల్’ !
ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బుల్లి తెర దివ్యాంక త్రిపాఠి తాజాగా కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ”ఓ సీరియల్ లేదా షోను పూర్తి చేసిన అనంతరం అసలు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో ఓ ఆఫర్ వచ్చింది. ఓ డైరెక్టర్ తో రాత్రంతా ఉంటే అతను నీకు అవకాశం ఇస్తాడు అన్నారు.

కానీ వాళ్ల ఆఫర్స్‌ను ఒప్పుకోకపోతే జరిగే నష్టం ఏమీ ఉండదు అంటూ” త్రిపాఠి వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని ఎవరో ఒకరు ఏదో రకంగా వైరల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆ బాధ్యతను దివ్యాంక త్రిపాఠి తలకెత్తుకుంది. ఈ మధ్య నటీమణులు వార్తల్లో వైరల్ కావడానికి కాస్టింగ్ కౌచ్ ను వాడుకుంటున్నారు అని రూమర్ కూడా ఉంది.
Also Read:పేరుకు పెద్దమనిషి.. అతని నీచబుద్ధి వల్ల బాలిక ఆత్మహత్య..