https://oktelugu.com/

Salman Khan Bodyguards: ఈ పాప నటించింది నాలుగు సినిమాలే.. కానీ ఫుల్ ఫేమస్.. ఎవరో గుర్తుపట్టండి

బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో పాపులర్ అయిన అదితీ రావు ఈమధ్య పాపులర్ హీరోయిన్. ఈమె పేరు సినిమాల్లో కంటే న్యూస్ లోనే ఎక్కువగా కనిపించింది. 2006 మమ్ముట్టి తో కలిసి ‘ప్రజాపతి’ సినిమాలో మొదటిసారిగా కనిపించింది. ఆ తరువాత 2011లో సుధీర్ మిశ్రా డైరెక్షన్లో వచ్చిన ‘యే సాలీ జిందగీ’లో నటించి ఫేమస్ అయింది. ఆ తరువాత ఆమె రాక్ స్టార్, ఖూబ్ సూరత్, ఫితూర్ లల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 27, 2023 / 10:41 AM IST

    Salman Khan Bodyguards

    Follow us on

    Salman Khan Bodyguards: సినిమా ఇండస్ట్రీలో మ్యాజిక్స్ బాగా జరుగుతూ ఉంటాయి. సినీ పరిశ్రమకు వచ్చిన కొందరు ఎన్నో సినిమాల్లో నటించినా పేరుకు రారు. మరికొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ అయిపోతారు. అలా స్టార్ అయిన వాళ్ళు ఊరికే ఉండరు. ఎవరో ఒకరితో ప్రేమలో పడిపోతారు. వెంటనే పెళ్లి కూడా చేసుకుంటారు. ఇలాగే ఓ హీరోయిన్ సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజల్లోనే ఓ హీరోతోచెట్టాపట్టలేసుకొని తిరిగింది. ఆ తరువాత అతనిని పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు. అంతటితో ఆగకుండా ఈ భామ తెలుగు సినిమాల్లో నటించిన తరువాత ఇప్పుడు మరో హీరోతో లవ్లో పడింది. త్వరలో వీరిద్దరు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇంతలో ఆమెకు సంబంధించిన ఓ చైల్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా భామ అంటే?

    బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో పాపులర్ అయిన అదితీ రావు ఈమధ్య పాపులర్ హీరోయిన్. ఈమె పేరు సినిమాల్లో కంటే న్యూస్ లోనే ఎక్కువగా కనిపించింది. 2006 మమ్ముట్టి తో కలిసి ‘ప్రజాపతి’ సినిమాలో మొదటిసారిగా కనిపించింది. ఆ తరువాత 2011లో సుధీర్ మిశ్రా డైరెక్షన్లో వచ్చిన ‘యే సాలీ జిందగీ’లో నటించి ఫేమస్ అయింది. ఆ తరువాత ఆమె రాక్ స్టార్, ఖూబ్ సూరత్, ఫితూర్ లల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

    అదితీ రావు తండ్రి అస్సాంకు చెందిన వారు కాగా.. తల్లి వనపర్తి జిల్లాకు చెందిన వారు. దీంతో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఆంధ్రప్రదేశ్ లోనిమదనపల్లెలో సాగింది. ఆ తరువాత పై చదువుల కోసం ఢిల్లీ వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు తెలుగు సినిమాల్లో నటించే అవకాశం రాగానే వెంటనే ఒప్పేసుకుంది. 2018లో ‘సమ్మోహనం’ అనే సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈమె ఆ తరువాత అంతరిక్షం, వి, మహా సముద్రం సినిమాల్లో నటించింది. హిట్టు, ఫట్టు తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసిన ఆమె మొత్తంగా నాలుగు సినిమాల్లోని నటించింది. కానీ ఆమె ఇక్కడా కూడా పాపులర్ అయ్యారు.

    అయితే అదితీ రావు బాలీవుడ్ సినిమాలు తీస్తున్న సమయంలో 2002లో నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మరో పెళ్లి చేసుకోలేదు. కానీ ఇటీవల నటుడు సిద్ధార్థతో కలిసి ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలల కిందట ఆమె బర్త్ డే సందర్భంగా సిద్ధార్థ స్పెషల్ విషెష్ చెప్పాడు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె చిన్ననాటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది.