Salman Khan- NTR: ఒకప్పుడు ఫ్లాప్ లతో బాధపడిన షారుఖ్ ఖాన్ ఏకంగా బాలీవుడ్ ను శాసించే స్థాయికి వెళ్లాడు. పఠాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని వెయ్యి కోట్ల రూపాయాలు కొల్లగొట్టిన షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో మరింత క్రేజ్ పెంచుకున్నాడు. ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల మార్కును సంపాదించింది. అయితే బాలీవుడ్ లో ఈ స్టార్ హీరో దరిదాపుల్లోకి కూడా ఏ హీరో రాలేకపోతున్నారు. గత దశాబ్దం మొత్తంలో షారుఖ్ ఖాన్ ను డామినేట్ చేశాడు సల్మాన్ ఖాన్. ఈయన నటించే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యేవి. కానీ ప్రస్తుతం షారుఖ్ రేంజ్ ను మాత్రం అందుకోలేకపోతున్నారు బాద్ షా.
కరోనా తర్వాత సల్మాన్ ఖాన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి నిదర్శనమే టైగర్ 3 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మరీ దారుణంగా ఉన్నాయనే చెప్పాలి. వీటిని చూస్తే ఇది సల్మాన్ ఖాన్ సినిమానా? అనే సందేహం కలుగుతుందట. కంటెంట్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ లో మంచి ఓపెనింగ్స్ సాధించే ఏకైక హీరో సల్మాన్ ఖాన్. అలాంటి సల్మాన్ భాయ్ టైగర్ సిరీస్ కి సీక్వెల్ చేస్తున్నాడంటే బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అంతే కాదు ఆల్ టైం రికార్డు లెవల్ లో బుకింగ్స్ వస్తాయని అనుకుంటారు. కానీ ఈ సారి బుకింగ్స్ మాత్రం అందరిని ఆశ్యర్యానికి గురి చేశాయి.
ఈ సినిమాలో షారుక్ ఖాన్ కూడా ఓ 20నిమిషాలు కనిపిస్తారట.అంతేకాదు హృతిక్ రోషన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు అని తెలుస్తోంది. అంటే ముగ్గురు స్టార్ ఇందులో ఉన్నారు. అంతే కాదు మన టాలీవుడ్ గ్లోబర్ స్టార్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా భాగమయ్యారు. ఇంత మంది స్టార్స్ ఉన్నా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పేరును సోషల్ మీడియాలో తెగ వాడేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రభావం వల్ల సౌత్ లో అయినా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతాయని అనుకుంటున్నారట.
మరి సల్మాన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను ఈ రేంజ్ లో వైరల్ చేస్తున్న సందర్బంగా ఇక్కడ అయినా అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే.. ఈ సినిమాకు మొదటి రోజు ఇండియాలో 40 కోట్ల రూ. నెట్ వసూళ్లు వస్తాయని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి చూడాలి ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుంది. సల్మాన్ ఖాన్ రేంజ్ పెరుగుతుందా? తగ్గుతుందా అనేది.