Pawan Kalyan- Salman Khan: చాలా కాలం నుండి బాలీవుడ్ లో అక్కడి స్టార్ హీరోలు సౌత్ లో సూపర్ హిట్ సాధించిన సినిమాలను రీమేక్ చేసి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న సందర్భాలెన్నో మనం చూసాము..సల్మాన్ ఖాన్ , అమిర్ ఖాన్ , హ్రితిక్ రోషన్ మరియ్ అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం రీమేక్ సినిమాలే అవ్వడం విశేషం..ఉదాహరణ కి బాలీవుడ్ లో మొట్టమొదటి వంద కోట్ల సినిమా ‘గజినీ’ కూడా తమిళం లో సూపర్ హిట్టైన సూర్య గజినీ సినిమాకి రీమేక్ అనే విషయం మన అందరికి తెలిసిందే..ఇక సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న ఆయన కెరీర్ ని గాడిలో పడేసిన సినిమా పోకిరి రీమేక్..హిందీ లో ఆయన పోకిరి సినిమాని ‘వాంటెడ్’ పేరు తో రీమేక్ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యాడు..ఆ తర్వాత కూడా ఆయన సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా ఎన్నో సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు కూడా వరుస ఫ్లాప్స్ లో ఉన్న సల్మాన్ ఖాన్ తన కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టుకునేందుకు సౌత్ సినిమానే నమ్ముకున్నాడు..అది కూడా మన టాలీవుడ్ సినిమా కావడం విశేషం..పవన్ కళ్యాణ్ హీరో గా, శృతి హాసన్ హీరోయిన్ గా డాలి దర్శకత్వం లో తెరకెక్కిన ‘కాటమరాయుడు’ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ కాటమరాయుడు సినిమాకి రీమేక్ అట..ఇందులో శృతి హాసన్ రోల్ ని పూజ హెగ్డే చేస్తుండగా,ఆమె అన్న పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు..వాస్తవానికి పవన్ కళ్యాణ్ కెరీర్ లో కాటమరాయుడు సినిమా పెద్దగా ఆడలేదు..తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన ‘వీరం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం..తెలుగు లో కమర్షియల్ గా బీలో యావరేజి గ్రొస్సర్ గా నిలిచింది..కానీ సరైన హిట్ లేకుండా శతమతవుతున్న బాలీవుడ్ కి కాటంరాయుడు లాంటి యావరేజి సినిమా కూడా మహా ప్రసాదం లాంటిది..అందుకే సల్మాన్ ఖాన్ ఈ సినిమాని ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ గత మూడు చిత్రాలైన రాధే, రేస్ 3 మరియు దబాంగ్ 3 వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..ఇప్పుడు ఈ కాటంరాయుడు రీమేక్ తో మళ్ళీ ఆయన ఫామ్ లోకి రావడానికి చూస్తున్నాడు..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరుకు ఒక యావరేజి సినిమాని రీమేక్ చెయ్యడం జరగలేదు..మొట్టమొదటిసారి సల్మాన్ ఖాన్ ఈ విన్నూతన ప్రయత్నం చేస్తున్నాడు..మరి సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.