Ram Charan: టాలీవుడ్ లో నేటి తరం మాస్ హీరోలు ఎవరు అంటే టక్కుమని మన మైండ్ లో గుర్తుకువచ్చే ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..చేసింది తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ కూడా 3 ఇండస్ట్రీ హిట్లు ఉన్న ఏకైక నేటి తరం స్టార్ హీరో ఆయన..ఆయనతో ఒక సినిమా చెయ్యాలని ప్రతి దర్శక నిర్మాతకి కోరిక ఉంటుంది..ఎందుకంటే రామ్ చరణ్ హిట్టు కొడితే మాములుగా ఉండదు..ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నీ చెరిపేస్తాడు..ఆయన కెరీర్ ని చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది..#RRR సినిమా తో ప్రపంచవ్యాప్తంగా పాన్ వరల్డ్ స్టార్ రేంజ్ గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్, ఆ సినిమా తర్వాత సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది..ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని తన 50 వ చిత్రం గా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ చెయ్యబొయ్యే ప్రాజెక్ట్స్ అభిమానులకు ఊరట కలిగిస్తుంది..కన్నడ లో స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలుగుతున్న నర్తన్ రామ్ చరణ్ తో ఒక సినిమా చెయ్యడానికి సిద్ధం అవుతున్నట్టు గత కొద్దీ రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి..నేవి బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ స్టోరీ ని ఇటీవలే రామ్ చరణ్ ని కలిసి వినిపించగా ఆయనకీ ఎంతగానో నచ్చినట్టు, వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త..వాస్తవానికి KGF సిరీస్ తర్వాత హీరో యాష్ చెయ్యాల్సిన సినిమా అట ఇది.

కానీ యాష్ కి ఎందుకో ఈ స్టోరీ పెద్దగా నచ్చలేదు..కానీ రామ్ చరణ్ కి అమితంగా నచ్చింది..ఈ నర్తన్ అనే దర్శకుడు కన్నడం లో మఫ్టీ అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి దర్శకత్వం వహించాడు..ఆ తర్వాత కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించాడు ఈయన..తెలుగు లో బోయపాటి శ్రీను ఎలాంటి మాస్ డైరెక్టరో, కన్నడం లో ఈయన కూడా ఆ రేంజ్ మాస్ డైరెక్టర్ అట..రామ్ చరణ్ 16 వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం.