Salman Khan Health: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు డెంగ్యూ నిర్దారణ అయింది. కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పరీక్షలు చేయించుకోగా డెంగ్యూ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కారణంగా కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సల్మాన్ ఖాన్ కు డెంగ్యూ రావడంతో ఆయన తీసే సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఆయన ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్ హోస్ట్ గా కూడా చేస్తున్నాడు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలన్నందున ఆ షోకి వెళ్లే అవకాశం లేదు. అయితే ఆయన స్థానంలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ కనిపించనున్నాడు.

డెంగ్యూ కారణంగా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్ట్ చేయలేడని హౌస్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆయన స్థానంలో రెండు వారాల పాటు కరణ్ జోహార్ చేస్తాడని షో నిర్వాహకులు పేర్కొన్నారు. గత సంవత్సరం బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ షో కు కరణ్ జోహార్ హోస్ట్ గా చేశారు. దీనిని అప్పుడు Voot లో ప్రసారం చేశారు. ఆ ఎపిసోడ్ మొత్తం కరణ్ జోహారే కొనసాగారు. ఇప్పుడు మొదటిసారిగా టీవీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు.
బిగ్ బాస్ టీవీ షో లో ప్రస్తుతం 16 సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్ లో హౌస్ లోకి టీనా దత్తా, సుంబుల్ తౌకీర్, షాలిన్, భానోట్, అర్చన, గౌతమ్, శివ్ థాకరే, గౌతమ్ సింగ్ విగ్, సాజిత్ ఖాన్, అబ్దు రోజిక్, తదితరులు ఎంట్రీ ఇచ్చారు. 16వ సీజన్ కోసం కొన్ని వారాల పాటు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేశారు. ఇప్పుడు రెండు వారాలపాటు కరణ్ కనిపించనున్నారు. దీంతో కరణ్ ను బిగ్ బాస్ వేదికగా చూడాలని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే కరణ్ నటించే షో ఈ వారం ప్రసారం అయ్యే అవకాశం లేదు. దానిని ఎప్పుడు ప్రసారం చేస్తారనేది ఆసక్తిగా మారింది.

సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఇండస్ట్రీలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘కుచ్ కుచ్ హోతాహౌ’ సినిమాలో రెండో ప్రధాన పాత్రలో కరణ్ కు సల్మాన్ ఖాన్ అవకాశం ఇచ్చారు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ సినిమాలకు కరణ్ నిర్మాతగా ఉన్నారు. ఇలా వీరిద్ధరి మధ్య సాన్నిహిత్యం ఉంది. కరణ్ ప్రస్తుతం సినిమాలు, ‘కాపీ విత్ కరణ్’ అనే ప్రొగ్రాంతో బిజీగా ఉన్నారు. అయినా సల్మాన్ కోసం వాటిని పక్కనపెట్టేసి బిగ్ బాస్ హౌస్ కు హోస్ట్ గా రానున్నారు.