Salman Khan and Harish Shankar : మన టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ ఉంటారు, కొత్త రకమైన సబ్జక్ట్స్ ని ఇష్టపడే ఆడియన్స్ ఉంటారు, భారీ గ్రాఫికల్ వండర్స్ ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా అన్ని రకాల జానర్స్ ని ఇష్టపడే ఏకైక ఇండస్ట్రీ మన టాలీవుడ్ మాత్రమే అనుకుంట. అయితే పాన్ ఇండియన్ మార్కెట్ మోజులో పడి ఈమధ్య కాలం లో మన స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేయడం మానేశారు. దీంతో అనేక మంది కమర్షియల్ డైరెక్టర్స్ మెల్లగా కనుమరుగు అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి డైరెక్టర్స్ జాబితాలో హరీష్ శంకర్(Harish Shankar) కూడా ఉన్నాడు. ‘గబ్బర్ సింగ్’ చిత్రం తో ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసినప్పుడు భవిష్యత్తులో హరీష్ శంకర్ పేరు గట్టిగా వినిపిస్తోందని అందరూ అనుకున్నారు కానీ, ఎందుకో ఆయన మీడియం రేంజ్ డైరెక్టర్ గానే మిగిలిపోయాడు.
Also Read : ‘సికిందర్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..సల్మాన్ కి ఇంత తక్కువనా?
అయితే పవన్ కళ్యాణ్ తో నాలుగేళ్ల క్రితం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad BhagatSingh) చిత్రాన్ని ప్రకటించాడు హరీష్ శంకర్. సినిమా మొదలై కొంతభాగం షూటింగ్ కూడా జరుపుకుంది. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పొలిటికల్ గా బాగా బిజీ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ గ్యాప్ లో ఆయన రవితేజ తో మిస్టర్ బచ్చన్ చిత్రం చేసుకొని వచ్చాడు. ఈ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత కూడా ఆయన వెంటనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మొదలు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో, పవన్ కళ్యాణ్ కే తెలియదు కాబట్టి. ఆందుకే ఈ గ్యాప్ లో మరో ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని వచ్చే ప్రయత్నం లో ఉన్నాడు హరీష్ శంకర్. LLP సినిమాతో ఒకటి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరొక సినిమా చేయడానికి ఒప్పుకున్న హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సల్మాన్ ఖాన్(Salman Khan) తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
సల్మాన్ ఖాన్ తో చర్చలు ఏడాది క్రితమే జరిగాయి, కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తుంది. మొన్ననే సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సికిందర్'(Sikindar Movie) భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది. ఈ చిత్రానికి దర్శకుడు మన సౌత్ ఇండియా కి చెందిన AR మురుగదాస్. అంత పెద్ద ఫ్లాప్ ఇచ్చినప్పటికీ కూడా, ఫామ్ లో లేని మరో సౌత్ ఇండియన్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా ఒప్పుకోవడం ఏమిటి అని సల్మాన్ అభిమానులు సోషల్ మీడియా లో మండిపడుతున్నారు. అయితే హరీష్ శంకర్ అంటే రీమేక్ సినిమాలే ఎక్కువగా చేస్తాడు, ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో చేయబోయే సినిమా కూడా ఒక పాపులర్ టాలీవుడ్ హిట్ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ తో ఉంటుందని తెలుస్తుంది.
Also Read : సల్మాన్ ఇంట్లో ఆ 3 రోజులు మర్చిపోలేను- సుదీప్ కూతురు శాన్వీ!