https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: వారిద్దరి మధ్య వ్యవహారం నడుస్తుంది… లవ్ మేటర్ లీక్ చేసిన బెజవాడ బేబక్క!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మొదటి ఎలిమినేషన్ జరిగింది. సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క ఇంటి బాట పట్టింది. కాగా బిగ్ బాస్ బజ్ లో మాజీ కంటెస్టెంట్ అర్జున్ అంబటి ఆమెను ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో హౌస్లో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని ఆమె అన్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : September 9, 2024 / 11:37 AM IST

    Bigg Boss 8 Telugu(29)

    Follow us on

    Bigg Boss 8 Telugu: సోషల్ మీడియా స్టార్ బేబక్క బిగ్ బాస్ సీజన్ 8లో ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఆశించిన స్థాయిలో ఆమె రాణించలేదు. అంచనాల మధ్య హౌస్లో అడుగుపెట్టిన బేబక్క ఫస్ట్ వీక్ లోనే మూటా ముల్లె సర్దుకుంది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో బేబక్క ఎనర్జీ చూసి… ఆమె కొన్ని వారాలు హౌస్లో ఉంటుందని ఆడియన్స్ భావించారు. బేబక్క కంటెంట్ ఇవ్వడంతో ఫెయిల్ అయ్యింది. శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్విరాజ్, విష్ణుప్రియ, సోనియా ఆకుల, బేబక్క నామినేట్ అయ్యారు. వీరిలో అత్యల్పంగా ఓట్లు పొందిన బేబక్క ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

    ఎలిమినేషన్ అనంతరం బేబక్క బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నారు. సీజన్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరైన అర్జున్ అంబటి బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అర్జున్ అంబటి గత వారం రోజుల్లో బిగ్ బాస్ హౌస్లో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రశ్నలు కురిపించాడు. ఇక హౌస్లో చీఫ్స్ గా ఉన్న నిఖిల్ తన టీమ్ లోకి తీసుకోకపోవడం పై అర్జున్ అంబటి ప్రశ్న అడిగారు. అతడు సోనియా పట్ల ఆకర్షితుడిగా ఉన్నాడు. అందుకే నన్ను కాదని ఆమెను తీసుకున్నాడని బేబక్క అన్నారు.

    హౌస్లో సోనియా-నిఖిల్ సన్నిహితంగా ఉంటున్నారు. అది హౌస్లో అందరికీ తెలుసని బేబక్క కీలక కామెంట్స్ చేశారు. బేబక్క మాటలు పరిశీలిస్తే ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనే భావన కలుగుతుంది. సోనియా-నిఖిల్ సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో వారి మధ్య బంధం ఏమిటనేది సమయం గడిస్తే కానీ తెలియదు. సోనియాను నిఖిల్ ఓ సిస్టర్ లా చూస్తున్నాడు అనే వాదన కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ మేరకు కామెంట్స్ పెడుతున్నారు.

    ఇక 14 మంది కంటెస్టెంట్స్ మొదలైన షోలో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. బేబక్క ఎలిమినేటేషన్ తో ఒక నెంబర్ తగ్గింది. ఐదు వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని సమాచారం. మరో ఐదుగురు సెలెబ్స్ కంటెస్టెంట్స్ గా హౌస్లోకి వెళ్లే అవకాశం ఉంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ మొదలైంది.

    కాగా ఈసారి పేరున్న సెలెబ్స్ ఎవరూ హౌస్లోకి వెళ్ళలేదు. ఈ విషయంలో ప్రేక్షకులు నిరాశకు గురి అవుతున్నారు. కనీసం వైల్డ్ కార్డు ఎంట్రీలు అయినా ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు ఉంటాయేమో చూడాలి. ప్రస్తుతానికి విష్ణుప్రియ టైటిల్ రేసులో ఉంది. ఆమె పేరున్న సెలెబ్రిటీ కావడంతో టైటిల్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.