Salman Khan: బాలీవుడ్ లో టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టే హీరోలలో ఒకడు సల్మాన్ ఖాన్(Salman Khan). కరోనా పీరియడ్ కి ముందు ఆయనకు పోటీ ని ఇచ్చే హీరో ఒక్కరు కూడా లేరు అనడంలో అతిశయోక్తి లేదు. అమీర్ ఖాన్ ఒక్కడు పోటీ ని ఇచ్చేవాడు కానీ, ఆయన సినిమాలు చాలా ఆలస్యంగా విడుదల అయ్యేవి. దీంతో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ నెంబర్ 1 హీరోగా 12 ఏళ్ళ పాటు ఏలాడు. అలాంటి సల్మాన్ ఖాన్ కరోనా పీరియడ్ మొదలయ్యాక బాగా డౌన్ అయిపోయాడు. ఆయన హీరో గా నటించిన ‘దబాంగ్ 3’ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన ప్రతీ సినిమా అభిమానులను నిరాశ పరుస్తూ వచ్చాయి. చివరికి ‘టైగర్ 3’ కూడా యావరేజ్ రేంజ్ లో ఆడింది. దీంతో సల్మాన్ అభిమానులు ఇప్పుడు సికిందర్ చిత్రం పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.
Also Read: కన్నప్ప మూవీ పై ట్రోల్స్ చేస్తే సర్వ నాశనమైపోతారు – మూవీ టీం
తమిళ టాప్ డైరెక్టర్ AR మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు మేకర్స్. ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ చాలా మంది నాకు రష్మికకు(Rashmika Mandanna) మధ్య చాలా వయస్సు తేడా ఉందని, దాదాపుగా 31 ఏళ్ళ తేడా ఉన్న అమ్మాయితో కలిసి సల్మాన్ ఖాన్ ఎలా నటిస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక తండ్రికి లేని సమస్య మీకు ఎందుకు. రేపు ఒకవేళ హీరోయిన్ కి పెళ్ళై, ఆమెకు కూతురు పుట్టి, పెద్ద హీరోయిన్ రేంజ్ కి ఎదిగితే, ఆమె తల్లి అనుమతి కోరి ఆమెతోనే కలిసి నటిస్తా. మేము నటీనటులం, మా మధ్య వయస్సు బేధాలు ఉండవు, కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి’ అంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్.
సల్మాన్ ఖాన్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే రష్మికకు బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమె నటించిన ప్రతీ బాలీవుడ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. ఆమె గత చిత్రాలు ‘పుష్ప 2’, ‘చావా’ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో కుదిపేశాయో మనమంతా చూసాము. అలాంటి రష్మిక నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై కూడా అంచనాలు బాగా ఏర్పడ్డాయి. కానీ నిన్న విడుదల చేసిన ట్రైలర్ కి రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. రొటీన్ కమర్షియల్ సినిమా లాగానే అనిపించింది.
నాకు రష్మికకు మధ్య 31 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంటే ఆమెకు, ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు
హీరోయిన్‌కు పెళ్లయి, ఆమె కూతురు బిగ్ స్టార్ అయితే తల్లి అనుమతి తీసుకొని ఆమెతోనూ నటిస్తా – సల్మాన్ ఖాన్ pic.twitter.com/FDX6LQJFUX
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2025