ప్చ్.. ఎంతవరకు నిలబడుతుంది అనేది డౌటే !

కరోనా విలయతాండవంలో కూడా పట్టుబట్టి తన సినిమాని ఈ నెల 13వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నద్ధం అయ్యాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘రాధే’. ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇంతకీ థియేటర్స్ ఓపెన్ లో ఉన్నాయా అంటే.. కొన్నిచోట్ల ప్రత్యేకించి ముంబై లాంటి కొన్ని చోట్ల ఈ సినిమా కోసం కొన్ని థియేటర్స్ ను ఓపెన్ చేస్తున్నారు. పైగా ఈ సినిమా థియేటర్లతో […]

Written By: NARESH, Updated On : May 11, 2021 6:19 pm
Follow us on

కరోనా విలయతాండవంలో కూడా పట్టుబట్టి తన సినిమాని ఈ నెల 13వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నద్ధం అయ్యాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘రాధే’. ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇంతకీ థియేటర్స్ ఓపెన్ లో ఉన్నాయా అంటే.. కొన్నిచోట్ల ప్రత్యేకించి ముంబై లాంటి కొన్ని చోట్ల ఈ సినిమా కోసం కొన్ని థియేటర్స్ ను ఓపెన్ చేస్తున్నారు.

పైగా ఈ సినిమా థియేటర్లతో పాటు ఆన్ లైన్ లో కూడా ఒకేసారి భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. అయితే, సల్మాన్ కోసం ముంబైలో కొన్ని చోట్ల థియేటర్స్ ను తెరిచే అవకాశం ఉన్నా.. ఇక దేశంలో ఎక్కడా థియేటర్లు తెరిచిలేవు అనేది వాస్తవం. అలాంటప్పుడు ఇక థియేటర్ రిలీజ్ అని పేరు ఎందుకు ? ఇదే విషయాన్ని మీడియా అడిగితే.. అసలు ఈ సినిమాకి థియేటర్స్ నుండి ఎలాంటి కలెక్షన్లు రావు అంటూ సల్మాన్ ఖాన్ తేల్చి చెప్పాడు.

సల్మాన్ మాటల్లోనే “అవును, మా సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఎక్కడో కొన్ని చోట్ల థియేటర్లు తెరిచి ఉన్నాయి కాబట్టి, థియేటర్స్ లో కూడా మా సినిమా కచ్చితంగా రిలీజ్ అవుతుంది. అయితే, జనం థియేటర్ కి వస్తారని నేను అనుకోవడం లేదు. మేము పూర్తిగా ఆన్ లైన్ పైనే ఆధారపడ్డాము. ఒకవిధంగా ఇది రిస్క్ కూడా. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రిస్క్ తప్పదు.

అయినా ఎప్పటికైనా ఏదైనా కొత్తదాన్ని ప్రారంభించే ముందు ఎవరో ఒకరైనా అడుగు ముందుకెయ్యాలి. మేం ఆ ఆలోచనతోనే మా సినిమాని విడుదల చేస్తున్నాం. ఆదరిస్తారని ఆశిస్తునాం’ అంటూ సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ సినిమాకి ఆన్ లైన్ లో ఎంతవరకు వసూళ్లు వస్తాయి అనేది డౌటే. అలాగే పైరసీ భూతాన్ని తట్టుకొని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా డౌటే.