spot_img
Homeఎంటర్టైన్మెంట్Salaar: సలార్‌ ‘పెద్దలకు మాత్రమే’నా?.. గుంటూరులో మైనర్లను అనుమతించని థియేటర్‌ యాజమాన్యం!

Salaar: సలార్‌ ‘పెద్దలకు మాత్రమే’నా?.. గుంటూరులో మైనర్లను అనుమతించని థియేటర్‌ యాజమాన్యం!

Salaar: ప్యాన్‌ ఇండియా మూవీ సలార్‌ దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 22న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ రికార్డులు బద్ధలు కొడుతోంది. సినిమాలో ప్రభాస్‌ యాక్షన్‌ సీన్స్‌ చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతున్న ప్రభాస్‌ సలార్‌ మూవీ రన్‌ టైమ్‌ ఎక్కువే అన్న వార్తలు నిజమయ్యాయి. ప్రశాంత్‌ నీల్‌ తన సినిమాల నిడివి పెద్దవిగా ఉంచే ఆనవాయితీని కొనసాగించాడు. అతని చివరి సినిమా కేజీఎఫ్‌ 2 రన్‌ టైమ్‌ 2 గంటల 48 నిమిషాలుగా ఉంది. తాజాగా సలార్‌ మూవీ రన్‌ టైమ్‌ ఏకంగా 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లు కావడం విశేషం.

సెన్సార్‌.. ఏ సర్టిఫికెట్‌..
ఈ సినిమాకు సీబీఎఫ్‌సీ ’ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ యాక్షన్‌ డ్రామా హింస కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో సలార్‌ కు అడల్ట్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. అంటే 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే థియేటర్లలో ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. ఈ మూవీ డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయింది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేశారు. ఆ రోజు అర్ధరాత్రి 12.30 గంటల నుంచే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోలు ప్రారంభం అయ్యాయి.

పడిపోయిన డంకీ వసూళ్లు..
బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ నటించిన డంకీ మూవీ డిసెంబర్‌ 21నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇద్దరు సూపర్‌ స్టార్లలో బాక్సాఫీస్‌ దగ్గర ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సలార్‌కు సక్సెస్‌ టాక్‌ రావడంతో రెండు రోజులకే డంకీ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. సలార్‌ వసూళ్లు పెరిగాయి.

మైనర్లకు గుంటూరు పీవీఆర్‌ థియేటర్‌ షాక్‌..
ఇదిలా ఉండగా సలార్‌కు ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో గుంటూరులో 18 ఏళ్లకన్నా తక్కువ ఉన్నవారిని థియేటర్‌లోకి అనుమతించడం లేదు. ప్రభాస్‌కు టీనేజర్లలో చాలామంది ఫ్యాన్స్‌ ఉంటారు. కానీ సలార్‌ చూసేందుకు వెళ్లిన అభిమానులకు గుంటూరు నాజ్‌ సెంటర్‌ లోని పీవీఆర్‌ థియేటర్‌ యాజమాన్యం షాక్‌ ఇచ్చింది. 18 ఏళ్లు నిండని వారిని లోపలికి అనుమతించలేదు. టికెట్లు ఇచ్చి థియేటర్‌లోకి అనుమతించకపోవడంపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ యాజమాన్యంతో గొడవ పడ్డారు. టికెట్‌ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల సూచనతో వారం రోజుల్లో డబ్బులు రీఫండ్‌ చేస్తామని యాజమాన్యం తెలిపింది. దీంతో గొడవ సద్దుమణిగింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version