https://oktelugu.com/

Salaar Trailer Update: సలార్ ట్రైలర్ గురించి ఫాన్స్ కి లేటెస్ట్ అప్డేట్

Salaar Trailer Update: రాధే శ్యామ్ సినిమా తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రబస్ హీరో సలార్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..KGF లాంటి సంచలన విజయం తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయిలో ఉన్నాయి..ఇప్పటికే 30 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది లో ఎలా అయినా షూటింగ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 20, 2022 / 01:12 PM IST
    Follow us on

    Salaar Trailer Update: రాధే శ్యామ్ సినిమా తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రబస్ హీరో సలార్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..KGF లాంటి సంచలన విజయం తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయిలో ఉన్నాయి..ఇప్పటికే 30 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది లో ఎలా అయినా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్ లోపు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకుకొచ్చేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడు..ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఇక రోజుకి ఒక్కటి వస్తుంది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ని విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అట.

    Salaar Trailer Update

    అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా కి సంబంధించిన చిన్న టీజర్ కట్ ని ఈ నెల 29 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు అట..అదే రోజున మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ టీజర్ కట్ ని ఆచార్య సినిమాతో జతపర్చబోతున్నట్టు సమాచారం..చాలా కాలం తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న ఊర మాస్ సినిమా కావడం తో ఈ మూవీ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా నుండి లీక్ విడుదల అయిన ప్రభాస్ లుక్స్ మరియు లీక్ అయిన కొన్ని షూటింగ్ వీడియోస్ చూసి మాస్ ప్రేక్షకులు మెంటలెక్కిపోతున్నారు..ఇక టీజర్ లో ప్రశాంత్ నీల్ టేకింగ్ తో ప్రభాస్ లాంటి మాస్ కట్ అవుట్ ఉన్న హీరో కనిపిస్తే అభిమానులు పరిస్థితి ఏమిటో ఊహించాకి కూడా అందదు అని చెప్పొచ్చు.

    Also Read: Anchor Shiva Jyothi: మీకో దండంరా బాబు.. మీరంతా నన్ను తల్లిని చేస్తున్నారు !

    ఇక ఈ టీజర్ కి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుంది అట..కేవలం టీజర్ మాత్రమే కాదు వచ్చే నెల ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో మరియు పెద్ద గాప్ కూడా లేకుండానే ఒక్క నిమిషం పాటు ఉండే చిన్న ట్రైలర్ కట్ ని కూడా సిద్ధం చెయ్యబోతున్నారు అట..రాబొయ్యే రోజుల్లో ప్రభాస్ అభిమానులకు సలార్ వార్తలతో ప్రతి రోజు పండగ లా ఉండబోతుంది అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి..రాధే శ్యామ్ సినిమా ఫ్లాప్ తో తీవ్రమైన నిరాశ లో ఉన్న ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ఒక్క ఫీస్ట్ గా ఉండబోతుంది అనట్టుయి సమాచారం..ప్రభాస్ ని మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత పవర్ ఫుల్ గా ఈ సినిమాలో ఆయన పాత్ర ని తీర్చి దిద్దారు అట..భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళం లో స్టార్ హీరోలు కొనసాగుతున్న ఫహద్ ఫాజిల్ మరియు పృథ్వీ రాజ్ లు కూడా ముఖ్య పాత్రలు పోషించబోతున్నట్టు సమాచారం.

    Also Read: AP Govt Using Recovery Money: రిక‌వ‌రీ డ‌బ్బుల‌నూ వ‌ద‌లని జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఇదేం తీరు బాబు..!

    Recommended Videos:

    Tags