https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: స్ర‌వంతిని వాడుకున్నావ్.. శివ‌పై బింధుమాధ‌వి ఫైర్‌.. అత‌ని వెన‌కాల ప‌డలేద‌న్న అషురెడ్డి..

Bigg Boss Telugu OTT: సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ హీట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఒక‌రిపైఒక‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా రెచ్చిపోతారు. ఆడ మ‌గ తేడా లేకుండా బూతుల‌పురాణం మొద‌లు పెడ‌తారు. హౌస్ లో లేడీస్ మ‌రీ దారుణం. నామినేష‌న్స్ గురించి వార‌మంతా ఎక్క‌డో ఒక‌చోటా డిస్క‌స్ చేస్తూనే ఉంటారు. ఇదే అదునుగా కొంత మంది పుల్ల‌లు పెట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకుంన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్ అయిన త‌ర్వాత మ‌రింత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 20, 2022 / 12:58 PM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT: సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ హీట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఒక‌రిపైఒక‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా రెచ్చిపోతారు. ఆడ మ‌గ తేడా లేకుండా బూతుల‌పురాణం మొద‌లు పెడ‌తారు. హౌస్ లో లేడీస్ మ‌రీ దారుణం. నామినేష‌న్స్ గురించి వార‌మంతా ఎక్క‌డో ఒక‌చోటా డిస్క‌స్ చేస్తూనే ఉంటారు. ఇదే అదునుగా కొంత మంది పుల్ల‌లు పెట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకుంన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్ అయిన త‌ర్వాత మ‌రింత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారాడు యాంకర్ శివ. టైటిల్ రేస్‌లో ముందున్నబిందు మాధవి, అఖిల్‌లు అనవసరమైన వాదనతో వెనుకబడుతుంటే శివ దూసుకెళ్తున్నాడు.

    Bigg Boss Telugu OTT

    కాగా ఈవారం అఖిల్, అషురెడ్డి, బిందు మాధవి, అనిల్, హమీద, అజయ్ ఎలిమినేష‌న్ కి నామినేట్ అయ్యారు. అయితే సీక్రెట్ రూమ్ లో ఉన్న బాబా భాస్కర్ కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. నామినేట్ అయిన ఆరుగురి సభ్యుల్లో ఒకరిని సేవ్ చేయాలని చెప్పారు. దీంతో అతడు బిందుమాధవిని సేవ చేయ‌గా అఖిల్, అషురెడ్డి, అనిల్, హమీద, అజయ్ నామినేష‌న్స్ లో ఉన్నారు.

    కాగా నామినేష‌న్స్ లో బిందు మాధవిని నామినేట్ చేయడం చేస్తూ.. వెళ్లిపోయిన స్రవంతి పేరుని వాడటం తనకి నచ్చలేదని అఖిల్ అన్నాడు. దీనికి బిందు మాధవి కౌంటర్ ఇస్తూ..స్రవంతిది గేమ్ కాదా? మీకు సేవల చేయడానికి వచ్చిందా? ఎమోషనల్‌గా ఆమెను వాడుకున్నావ్ కదా.. అంటూ బిందు మాధవి ఫైర్ అయ్యింది. దీంతో అఖిల్ కోపంతో ఏయ్ ఏం మాటలు మాట్లాడుతున్నావ్.. పిచ్చిదానిలా వాడుకున్నావ్ ఏంటి వాడుకున్నావ్.. ఆ అమ్మాయి వెళ్లిపోయిన తరువాత ఆమె తరుపున స్టాండ్ తీసుకున్నావా బిందూ అంటూ రెచ్చిపోయాడు.

    దీంతో బిందు మాధవి.. మీ గ్రూప్‌లో ఉన్న వాళ్లలో వాడు నీకు స్టాండ్ తీసుకున్నాడు.. నువ్ వాడికి స్టాండ్ తీసుకున్నావ్.. ఆ అమ్మాయికి ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయారని అడుగుతున్నా.. అంటూ అఖిల్‌కి కౌంటర్ ఇచ్చింది బిందు మాధవి. ఇలా ఇద్ద‌రూ ఓ రేంజ్ లో నామినేష‌న్స్ లో గొడ‌వ‌ప‌డుతూ వెక‌బ‌డుతున్నారు.

    దీని త‌ర్వాత నటరాజ్ మాస్టర్ దగ్గర కూర్చుని అఖిల్ ముచ్చట్లు పెట్టాడు. ఇదే సందుగా పక్కన చేరిన నటరాజ్ మాస్టర్ పుల్లలు పెట్టాడు. వాడుకున్నావ్ అని మొదట్లో అన్నప్పుడే కుమ్మేయాల్సింది.. ఎంత దారుణమైన పాయింట్ అదీ.. అమ్మాయిని వాడుకోవడం ఏంటి? ఆ మాట ఏంటి? అంటూ నటరాజ్ మాస్టర్ రెచ్చ‌గొట్టాడు. బిందు మాధవి మానసికంగా మనుషుల్ని చిత్రవధ చేయడమే ఆమె గేమ్.. టాస్క్‌లు ఆడి ముందుకు వెళ్లడానికి హౌస్‌కి రాలేదని చెప్పాడు ఈ ఫిట్టింగ్ మాస్ట‌ర్ న‌టరాజ్

    Bigg Boss Telugu OTT

    ఇక అషురెడ్డి విష‌యానికి వ‌స్తే మంగళవారం నాటి డే 51 ఎపిసోడ్‌లో శివపై నోరు జారింది. యాంకర్ శివ తనని నామినేట్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. కేవలం ఇగో వల్లే తనని నామినేట్ చేశాడు తప్పితే పాయింట్ లేదంటూ మాస్టర్‌తో ముచ్చట్లు పెట్టింది. అంతే కాదు కెమెరా ముందు సోఫాలో పడుకుని పెర్ఫామెన్స్ మొదలుపెట్టింది. నాకొకటి అర్ధం కాదు బిగ్ బాస్.. నేను ఎందుకు శివ వెనుక తిరుగుతాను.. అసలు ఆ పాయింట్ ఏంటి నేను శివ వెన‌క తిర‌గ‌డానికి అత‌ను పెద్ద మహేష్ బాబు మరీ.. నేను నా జీవితంలో ఎవరి చుట్టూ తిరగలేదు.. వాడి చుట్టూ తిరగానని అంటున్నాడు.. మళ్లీ వాళ్లందరూ సపోర్ట్ అతనికి? తనలో తాను మాట్లాడుకుంది.

    Bigg Boss Telugu OT

    కానీ శివ ఆటతీరు చూస్తే ఎవ్వ‌రూ అలా అనుకోరు. అషురెడ్డి ఎంటో గ‌త వారం ఎపీసోడ్ చూస్తే తెలుస్తుంది. గ‌త వారం ఆమె కెప్టెన్సీ ఈ సీజన్‌కే కాదు.. బిగ్ బాస్ హిస్టరీలోనే వరస్ట్ కెప్టెన్సీ అన్నా తక్కువేనేమో.. అంత చెత్తగా చేసింది. ఏదో ఒక్కవారం కెప్టెన్ కావడంతో.. ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అన్నట్టుగా ఫీల్ అయ్యి హౌస్ మొత్తాన్ని గబ్బు చేసిపారేసింది. కెప్టెన్సీ టాస్క్‌లో కూడా అషురెడ్డిని సంచాలక్‌గా నియమించడంతో ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఆ వారం వరస్ట్ పర్ఫామర్ అషురెడ్డే అంటూ ఇంటి సభ్యులంతా స్టాంప్‌లు గుద్దిపడేశారు. అఖిల్ కూడా అషురెడ్డిని వరస్ట్ అని స్టాంప్ గుద్దడం హైలైట్.

    Tags