https://oktelugu.com/

Salaar Teaser Tinnu Anand: సలార్ టీజర్ లో ఉన్న పెద్దాయన బ్యాక్ గ్రౌండ్ తెలుసా… మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్!

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో టినూ ఆనంద్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రాల్లో టినూ ఆనంద్ నటించారు. కమల్ హాసన్ హీరోగా పుష్కక విమానం అనే మూకీ సినిమా చేశారు. ఒక్క డైలాగ్ కూడా లేని ఈ చిత్రంలో టినూ ఆనంద్ కామెడీ విలన్ పాత్ర చేశారు. అలాగే సింగీతం తెరకెక్కించిన మరో అద్భుత చిత్రం ఆదిత్య 369. ఈ మూవీలో టైం ట్రావెల్ మెషీన్ కనిపెట్టిన సైంటిస్ట్ రోల్ చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 6, 2023 / 04:28 PM IST

    Salaar Teaser Tinnu Anand

    Follow us on

    Salaar Teaser Tinnu Anand: దేశవ్యాప్తంగా హైప్ నెలకొన్న సలార్ టీజర్ విడుదలైంది. జులై 6న ఉదయం 5:12 నిమిషాలకు టీజర్ విడుదల చేశారు. నిమిషాల వ్యవధిలో మిలియన్ వ్యూస్ రాబట్టింది. ప్రస్తుతం రికార్డు బ్రేకింగ్ దిశగా అడుగులు వేస్తుంది. ప్రభాస్ మారణహోమం తాలూకు విజువల్స్ అబ్బురపరిచాయి. ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ ఉండనుందని క్లారిటీ వచ్చింది. కాగా టీజర్లో మరొక హైలెట్ పాయింట్ ఒక వృద్ధుడు చెప్పిన డైలాగ్.వందల మంది సైన్యం చుట్టూ చేరి తుపాకులు ఎక్కుపెట్టినా బెదరకుండా… సలార్ ఎంత డేంజరస్ అని చేప్పే ఆ వృద్ధుని పాత్ర మెప్పించింది.

    సలార్ డైనోసర్… తనతో పెట్టుకుంటే ఏనుగు, టైగర్, చిరుత, సింహం కూడా మిగలవని అర్థం వచ్చేలా భారీ మాస్ డైలాగ్ చెప్పాడు. దీంతో ఆ వృద్ధుడు ఎవరు? ఆ నటుడు ఎవరనే? చర్చ మొదలైంది. ఈ తరం ఆడియన్స్ కి ఆయన తేలికపోవచ్చు. 90ల కాలం నాటి సినిమా లవర్స్ కి ఆయన సుపరిచితుడే. ఈయన పేరు టినూ ఆనంద్. తెలుగు, తమిళ్, హిందీతో పాటు పలు భాషల్లో నటించారు.

    దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో టినూ ఆనంద్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రాల్లో టినూ ఆనంద్ నటించారు. కమల్ హాసన్ హీరోగా పుష్కక విమానం అనే మూకీ సినిమా చేశారు. ఒక్క డైలాగ్ కూడా లేని ఈ చిత్రంలో టినూ ఆనంద్ కామెడీ విలన్ పాత్ర చేశారు. అలాగే సింగీతం తెరకెక్కించిన మరో అద్భుత చిత్రం ఆదిత్య 369. ఈ మూవీలో టైం ట్రావెల్ మెషీన్ కనిపెట్టిన సైంటిస్ట్ రోల్ చేశారు.

    ప్రభాస్-సుజీత్ కాంబోలో తెరకెక్కిన సాహో చిత్రంలో కూడా టినూ ఆనంద్ కీలక రోల్ చేశారు. ఒకానొక డాన్ గా నటించారు. టినూ ఆనంద్ రైటర్, డైరెక్టర్ కూడాను. టినూ తండ్రి పేరు ఇందర్ రాజ్ ఆనంద్. ఈయన రచయిత. నటులు అఘా, జలాల్ అఘా బంధువులే. స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మేనల్లుడు అవుతాడు. వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడిగా ఉన్నాడు. అదన్న మాట టినూ ఆనంద్ బ్యాక్ గ్రౌండ్..