Salaar: గత ఏడేళ్లలో ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే మూవీ పడలేదు. బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ సక్సెస్ దక్కలేదు. 2017లో బాహుబలి 2 రాగా ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఆ మూవీ రికార్డ్స్ కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. రెండేళ్లకు 2019లో సాహో విడుదల చేశారు. ఈ మూవీ నెగిటివ్స్ టాక్ తెచ్చుకుంది. హిందీ వెర్షన్ మాత్రం విజయం సాధించింది. ఈ సినిమా కొంత పర్లేదు అని చెప్పాలి. ఫ్యాన్స్ కి హై ఇచ్చే సీన్స్, ఎలివేషన్స్ ఉన్నాయి.
రాధే శ్యామ్, ఆదిపురుష్ అయితే పూర్తిగా నిరాశపరిచాయి. బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలు చవిచూశాయి. వందల కోట్ల నష్టాలు మిగిల్చాయి. ఈ చిత్రాల దర్శకులను ప్రభాస్ ఫ్యాన్స్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ప్రభాస్ నుండి ఒక భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆశిస్తున్న ఫ్యాన్స్ కి సలార్ సమాధానం చెబుతుందనే నమ్మకం గట్టిగా ఉంది. సలార్ ట్రైలర్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది.
సినిమా ఎలా ఉంటుందనే సందేహాలు కలిగించింది. దానికి తోడు ప్రభాస్ ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుందట. సినిమా మొదలైన అరగంటకు కూడా ప్రభాస్ కనిపించడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే సలార్ ఫస్ట్ సింగిల్ ‘సూరీడే’ విడుదల తర్వాత అంచనాలు మారిపోయాయి. ఈ పాట ఫ్యాన్స్ కి భలే నచ్చేసింది. వీటన్నింటికి మించి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేసే న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.
సలార్ మూవీ అద్భుతంగా ఉందట. సిల్వర్ స్క్రీన్ పై పక్కా మాస్ ఎంటర్టైనర్ ఆవిష్కృతం అయ్యిందట. యాక్షన్ బ్లాక్స్, కథలో ట్విస్ట్స్, ఎమోషన్స్… అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయట. సలార్ ష్యూర్ షాట్ హిట్ అట. ముందుగానే సంబరాలు చేసుకోవచ్చు అంటున్నారు. సలార్ చిత్రానికి యూనానిమస్ టాక్ వినిపిస్తుంది. సలార్ తో ప్రభాస్ బాక్సాఫీస్ ని వేటాడటం ఖాయం అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. పృథ్విరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర చేశాడు. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు .