Salaar OTT: సలార్ ఓటిటి రిలీజ్ డేట్ చెప్పేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ…

నిజానికి ప్రభాస్ స్టార్ హీరో అనే విషయం అందరికీ తెలుసు కానీ ఆయన సాధించిన విజయాలు మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో చాలా తక్కువగా ఉన్నాయి.

Written By: Gopi, Updated On : December 30, 2023 8:42 am

Salaar OTT

Follow us on

Salaar OTT: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ తనదైన రేంజ్ లో రెచ్చిపోతూ నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నాడు.ఇక ఈ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన సలార్ సినిమాతో ప్రభాస్ తనకంటూ భారీ మార్కెట్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇప్పటికే తనకున్న మార్కెట్ చాలా పెద్దది అని బాహుబలి 2 సినిమాతో నిరూపించాడు అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన సలార్ సినిమాతో మరొకసారి తన స్పాన్ ఏంటో నిరూపించాడు.

నిజానికి ప్రభాస్ స్టార్ హీరో అనే విషయం అందరికీ తెలుసు కానీ ఆయన సాధించిన విజయాలు మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు బాహుబలి సినిమా తర్వాత మూడు సినిమాలను రిలీజ్ చేస్తే అందులో మూడు సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక దానితో ఇప్పుడు రిలీజ్ చేసిన సలార్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయన రేంజ్ అనేది మారిపోయింది. ఇంత మంచి విజయం సాధించిన సలార్ సినిమా థియేటర్ లో సందడి చేస్తుంది అయినప్పటికీ ఈ సినిమా ని ప్రముఖ ఓటిటి సంస్థ ఒక ఫ్యాన్సి రేట్ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓటిటి రైట్స్ ని తీసుకుంది. ఇక ఈ సినిమాని వీలైనంత తొందరగా ఓటిటి లోకి తీసుకురావాలని నెట్ ఫ్లిక్స్ సంస్థ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూడడానికి చాలామంది అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సంస్థకి డైరెక్ట్ గా కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఓటిటిలోకి సలార్ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటూ వాళ్లకి మెసేజ్ లు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ మెసేజ్ లు పెట్టే వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ఓటిటిలోకి రిలీజ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ సంస్థ భావిస్తుంది. అయితే దీనికి సినిమా యూనిట్ మాత్రం సంక్రాంతి తర్వాత రిపబ్లిక్ డే కి ఈ సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే సంక్రాంతి కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇక దాంతో సలార్ క్రేజ్ అనేది తగ్గిపోతుంది. అలాగే కలక్షన్లు కూడా చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి ఈ సినిమాని సంక్రాంతికి ఓటిటి లో రిలీజ్ చేయడమే కరెక్ట్ అంటూ కొందరు వాదిస్తుంటే మరికొందరు మాత్రం సలార్ సినిమాని ఇంత తొందరగా ఓటిటి లోకి రిలీజ్ చేయకూడదు అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే సలార్ సినిమాని ఎప్పుడు తీసుకురావాలనేది అర్థం కాక నెట్ ఫిక్స్ వాళ్లు ఆలోచనలో పడినట్టుగా తెలుస్తుంది…