https://oktelugu.com/

Salaar Movie Surabhi Role : సలార్ లోని ఈ అమ్మాయి అసలు ఫొటో చూస్తే షాక్ అవుతారు.. ఎంత అందంగా ఉందంటే..?

నిజానికి ఆ సినిమాలో చూసిన ఈ అమ్మాయిని బయట చూస్తే అసలు మనం గుర్తుపట్టలేం మేకప్ తో ప్రశాంత్ నీల్ అంతలా మార్చేశాడనే చెప్పాలి...ఇక ఏది ఏమైనా ఇప్పుడు ఆ అమ్మాయి మీద మీమ్స్ అనేవి తెగ వైరల్ అవుతున్నాయి...

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2023 / 03:44 PM IST
    Follow us on

    Salaar Movie Surabhi Role : ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ సినిమా ట్రెండ్ నడుస్తుంది.ఇక ఇప్పటికే చాలా మంది ప్రభాస్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా రెండు మూడుసార్లు ఈ సినిమాను చూస్తున్నారు. ఇక ఈ సినిమాను చూస్తూ ఆనందానికి గురవుతున్నారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ప్రభాస్ కి ఒక మంచి హిట్టు పడిందనే చెప్పాలి. బాహుబలి 2 సినిమా తర్వాత ఆయనకి చెప్పుకోదగ్గ హిట్ అయితే పడలేదు. ఇక దాంతో వచ్చిన సక్సెస్ ని మళ్ళీ ఈ సినిమాతో రిప్లై చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

    ప్రశాంత్ నీల్ మొదటి నుంచి ఈ సినిమా మీద ప్రభాస్ అభిమానులకి ఒక హామీ ఇస్తూ వస్తున్నాడు. అది ఏంటి అంటే ప్రభాస్ ని ఇంతవరకు ఎవరు చూపించినట్టుగా నేను ఈ సినిమాలో చూపించబోతున్నాను అంటూ తను ఎలాగైతే హామీ ఇచ్చాడో ఈ సినిమాలో ఆయన చెప్పినట్టు గానే ఎలివేట్ చేస్తూ చూపిస్తూనే ప్రభాస్ ని చాలా కొత్తగా చూపించాడు. ప్రశాంత్ నీల్ కంప్లీట్ గా ప్రభాస్ ని వాడుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఫర్జానా అనే అమ్మాయి నేపథ్యంలో ఈ సినిమా లో ఒక బిగ్ ఫైట్ ఉంది.అది ఆ అమ్మాయి మీద బేస్ అయి ఉంటుంది ఆ అమ్మాయిని రౌడీ వచ్చి తీసుకుపోయే క్రమంలో ప్రభాస్ వాళ్ళతో ఫైట్ చేసి ఆ రౌడీ ని చంపేస్తాడు.

    అయితే ఆ అమ్మాయి ఆ సినిమాలో డిగ్లామర్ పాత్రను పోషించింది. బయట మాత్రం ఆమె చూడటానికి చాలా క్యూట్ గా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె సినిమాలో ఉన్న ఫోటో బయట నార్మల్ గా ఉన్న ఫోటోని కంపేర్ చేస్తూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పైన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏంటి ప్రశాంత్ మామ క్యూట్ గా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి మసి బొగ్గులా మార్చేసావు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

    ఇక దాంతో ఒక్కసారిగా ఆ అమ్మాయి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది. నిజానికి ఆ సినిమాలో చూసిన ఈ అమ్మాయిని బయట చూస్తే అసలు మనం గుర్తుపట్టలేం మేకప్ తో ప్రశాంత్ నీల్ అంతలా మార్చేశాడనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా ఇప్పుడు ఆ అమ్మాయి మీద మీమ్స్ అనేవి తెగ వైరల్ అవుతున్నాయి…