Pallavi Prashanth: బిగ్ బాస్ ని కోలుకోలేని దెబ్బ కొట్టిన పల్లవి ప్రశాంత్… ఇకపై అవి రద్దు!

లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు హెచ్చరించారు. పల్లవి ప్రశాంత్ నిబంధలను ఉల్లంగిస్తూ ఫ్యాన్స్ తో కలిసి ర్యాలీ నిర్వహించాడు. అభిమానులు అత్యుత్సాహంతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉన్న కంటెస్టెంట్స్ కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు.

Written By: Neelambaram, Updated On : December 26, 2023 3:52 pm
Follow us on

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలుసు. అదే రేంజ్ లో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. బిగ్ బాస్ షో అంటేనే కాంట్రవర్సీ కి కేర్ అఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఇది ప్రతి సీజన్ లో ఉండే రచ్చే అయినప్పటికీ .. ఈ ఉల్టా పుల్టా సీజన్ ముగిశాక మేకర్స్ కి పెద్ద షాక్ తగిలింది. కామన్ మ్యాన్ గా హౌస్ లో అడుగుపెట్టి టైటిల్ గెలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. అయితే ఫినాలే రోజు ప్రశాంత్ కోసం చాలా మంది ఫ్యాన్స్ పేరుతో అక్కడికి చేరుకున్నారు.

లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు హెచ్చరించారు. పల్లవి ప్రశాంత్ నిబంధలను ఉల్లంగిస్తూ ఫ్యాన్స్ తో కలిసి ర్యాలీ నిర్వహించాడు. అభిమానులు అత్యుత్సాహంతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉన్న కంటెస్టెంట్స్ కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు. పబ్లిక్ న్యూస్సెన్సు కేసు లో ప్రశాంత్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ పై జైలుకు తరలించారు. అయితే అరెస్ట్ అయిన 48 గంటల్లో పల్లవి ప్రశాంత్ కు బెయిల్ కూడా వచ్చింది.

అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అరెస్ట్ కావడం సంచలనం అయింది. ఈ షో బ్యాన్ చెయ్యాలి అంటూ కొందరు ప్రముఖులు కామెంట్స్ చేశారు. ఈ వివాధం లోకి హోస్ట్ నాగార్జునను కూడా లాగారు. నాగార్జున పై కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అంటూ ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక పై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎలాంటి ర్యాలీలు నిర్వహించకుండా ముందే అగ్రిమెంట్ చేసుకోనున్నారని తెలుస్తుంది.

కంటెస్టెంట్స్ గా సెలెక్ట్ అయిన వారికి గట్టి సూచనలు ఇవ్వనున్నారట. ఈ క్రమంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్, ఫైనలిస్టులు, విన్నర్ ఎవరూ ర్యాలీలు నిర్వహించడం, అభిమానులను అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కలవడం లేకుండా చేయాలని అనుకుంటున్నారట. తర్వాత సీజన్ నుంచి కంటెస్టెంట్స్ ర్యాలీలు ఉండవు. వారు నేరుగా ఇంటికి వెళ్లిపోయేలా అగ్రిమెంట్ చేసుకుంటారట. పోలీసులు కూడా ఇదే సూచన ఇవ్వనున్నారని సమాచారం.