Salaar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో అయితే బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకొని తెలుగు సినిమా స్థాయిని పెంచిన మొదటి హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న మన స్టార్ డైరెక్టర్లందరు సూపర్ సక్సెస్ లను సాధించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కన్నడ దర్శకుడు అయినప్పటికి మన స్టార్ హీరో అయిన ప్రభాస్ తో సలార్ సినిమా చేసి మనందరికి చాలా దగ్గర అయ్యాడు. ముఖ్యంగా ఆయన చేసిన సలార్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించింది. పాన్ ఇండియాలో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో దాదాపు 700 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ మాత్రం సలార్ సినిమా తనకి అంత పెద్దగా నచ్చలేదని చెప్పాడు. ఎందుకు అంటే ఆయన చూపించాల్సిన కెపబులిటీ ఇంకా అందులో లేదని సలార్ 2 సినిమాలో దానికి సంబంధించిన పూర్తి ఎఫర్ట్ ను పెట్టి భారీ సినిమాగా మలుస్తానని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశాడు. అనేదానిమీద సరైన స్పష్టత లేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే సలార్ 2 సినిమా అతన్ని పూర్తిగా సాటిస్ఫై చేసే విధంగా తీయబోతున్నాడనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
అంటే ఈ లెక్కన సలార్ సినిమా కంటే సలార్ 2 సినిమా భారీ ఇంపాక్ట్ ని ఇవ్వబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తను పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే సలార్ సినిమా దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడుతుందని ఆయన అంచనా వేశాడు.
కానీ ఆ సినిమా 700 కోట్ల వరకే కలెక్షన్లు రాబట్టడంతో కొంతవరకు నిరాశ చెందినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆ నిరాశ ఏమీ లేకుండా సలార్ 2 సినిమా ద్వారా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా దాదాపు 2000 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది… మరి ఇప్పటికైనా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి మరోసారి స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక ఇప్పటికే ప్రభాస్ ‘ఫౌజీ ‘ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘స్పిరిట్ ‘ సినిమాను చేసి అప్పుడు సలాడ్ 2 సినిమా మీద తన డేట్స్ కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ లో ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే…