Salaar Child Artist: సలార్ సినిమాతో అదిరిపోయే సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ నీల్ ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో చేసే సినిమా మీద పూర్తి ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే సలార్ సినిమా షూటింగ్ లో ప్రశాంత్ నీల్ చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే పృధ్వీ రాజ్ సుకుమారన్ చిన్నప్పటి పాత్ర కోసం కార్తికేయ అనే ఒక కుర్రాడిని సెలెక్ట్ చేసి అతని చేత నటింపజేశారు.
ఇక ఈ సినిమా లో ఆ కుర్రాడి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే ఆ కుర్రాడి నటనకి ఫిదా అయిపోయిన ప్రశాంత్ నీల్ ఆ కుర్రాడి తో షూటింగ్ స్పాట్ లో చాలా సేపు మాట్లాడుతూ ఉండేవారట షూటింగ్ లొకేషన్ లో ఏ మాత్రం ఖాళీ దొరికిన ఆ అబ్బాయితో ఎక్కువ గా మాట్లాడుతూ అతను ఏం చేస్తున్నాడు అనే విషయాల మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి మాట్లాడుతూ ఉండేవాడు.
ఇక ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ ఒక రోజు ఆ కుర్రాడిని నువ్వు ఏం చదువుతున్నావు అని అడిగితే కార్తికేయ నేను టెన్త్ చదువుతున్నాను సార్ అని చెప్పాడంట ఇక అప్పుడు ప్రశాంత్ నీల్ ఈ ఇయర్ నీకు బోర్డు ఎగ్జామ్ ఉంటుంది కదా అంటే అవును సర్ అని చెప్పాడట అప్పుడు ప్రశాంత్ నీల్ భయపడిపోయి ఆ పరీక్షలు బాగా రాసి పాసవ్వు లేకపోతే మీ అమ్మ నాన్న నిన్ను సినిమా పేరు తో నేను చెడగొట్టాను అంటూ నన్ను తిట్టుకుంటారు. అని కార్తికేయతో కామెడీ గా చెప్పవాడట దాంతో కార్తికేయ కూడా పాస్ అవుతాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పినట్టు గా కార్తికేయ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.
ఇక అందులో భాగంగానే పృధ్వీ రాజ్ సుకుమారన్ చేస్తున్న లూసిఫర్ 2 సినిమా కోసం ఆ కుర్రాడిని తీసుకోమని పృథ్వి రాజ్ సుకుమారన్ కి కూడా ప్రశాంత్ నీల్ రికమెండ్ చేశాడని కార్తికేయ ఆ ఇంటర్వ్యూ లో చెప్పాడు.అలా ప్రశాంత్ నీల్ బాగా నటించే నటుల పట్ల చాలా కేర్ ఫుల్ గా ఉంటూనే వాళ్లకు సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్న తనే దగ్గరుండి చూసుకుంటాడు అనడానికి కార్తికేయని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అలాగే మంచి టాలెంట్ ఉన్న వాళ్లకి వేరే సినిమాల్లో మంచి క్యారెక్టర్లు ఇప్పించే విధంగా కూడా తను చాలా హెల్ప్ చేస్తారంటూ ప్రశాంత్ నీల్ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తున్నారు…