Salaar Collection: అంచనాలకు తగ్గట్లే సలార్ మూవీ కలెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ లో సలార్ అనేక రికార్డ్స్ బద్దలు కొట్టింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ చిత్రంపై విపరీతమైన బజ్ ఏర్పడింది. ఆన్ లైన్లో ఆఫ్ లైన్లో సలార్ టికెట్స్ కోసం జనాలు ఎగబడ్డారు. విడుదలకు ముందు రోజే టికెట్స్ కోసం థియేటర్స్ వద్ద క్యూ కట్టారు. కెజిఎఫ్ దర్శకుడితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ అనేసరికి విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్స్ హైప్ మరింత పెంచాయి.
సలార్ చిత్రానికి కనీస ప్రొమోషన్స్ లేవు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేదు. ప్రభాస్ ప్రెస్ ముందుకు రాలేదు. అయినప్పటికీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. సినిమా జనాల్లోకి వెళ్ళింది. సలార్ మూవీ ఓపెనింగ్ డే అనేక రికార్డులు ధ్వంసం చేసింది. నైజాంలో ఈ మూవీ మొదటి రోజు రూ. 32 కోట్ల గ్రాస్… రూ. 22.55 కోట్ల షేర్ రాబట్టింది. ఇది టాలీవుడ్ సెకండ్ హైయెస్ట్.
సలార్ చిత్రానికి మల్టీఫ్లెక్స్ లు దొరకలేదు. అది మైనస్ అయ్యింది. లేదంటే కలెక్షన్స్ ఇంకా భారీగా ఉండేవి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో భారీ ఆదరణ దక్కింది. తాజా సమాచారం ప్రకారం సలార్ యూఎస్ కలెక్షన్స్ $3.6 మిలియన్ దాటేశాయి. ఇండియా వైడ్ సలార్ ఫస్ట్ డే రూ. 95 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు అంచనా. ఇక వరల్డ్ వైడ్ రూ. 175 కోట్లు వసూలు చేసింది. ఇది 2023 హైయెస్ట్ ఓపెనింగ్ ఫిగర్.
అన్ని ఏరియాల లెక్కలు రావాల్సి ఉంది. సలార్ మూవీలో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర చేసిన విషయం తెలిసిందే. జగపతిబాబు, ఈశ్వరి రావు, బాబీ సింహ ఇతర కీలక పాత్రలు చేశారు. సలార్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ జనాలు సినిమా చూసేందుకు ఎగబడ్డారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ అవతార్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. సలార్ పార్ట్ 2 కూడా ఉంది.